Breaking News

వరద బాధితులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలంటూ నిరాహార దీక్ష…

-వైసీపీ నేతలు వెల్లంపల్లి, దేవినేని, మల్లాది

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవ‌ల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్ట‌పోయిన వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ఆరోపించారు. కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చారే త‌ప్పా, బాధితులకు ఎలాంటి సాయం చేసింది లేద‌న్నారు. వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వైసీపీ నేతలు నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లనే బుడమేరు వరదలు వచ్చాయని, మైలవరం, జగ్గయ్యపేట,జక్కంపూడి కాలని, విజయవాడ లోని సింగినగర్ తో పాటు ఇతర ప్రాంతాలు నీట మునిగి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని ఆరోపించారు. వరద సాయం కోసం బాధితులు రోజూ కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్త‌న్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్సార్సీపీ కోటి కాదు..కోటి 50 లక్షలు ఖర్చు పెట్టిందన్నారు. 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని వివ‌రించారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడని, వరదలను సాకుగా చూపి వందల కోట్లు వసూళ్లు చేశారన్నారు. బాధితులకు ఎంతిచ్చారో మంత్రులు చెప్పలేకపోతున్నారని,.. ఆర్టిఏ అప్ప్లే చేసుకోమంటున్నారన్నారు. కుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియా లో ఒక్కరికి కూడా నష్ట పరిహారం అందలేదన్నారు.

సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జీ మల్లాది విష్ణు మాట్లాడుతూ 534 కోట్ల రూపాయిలు వరద బాధితులకు నష్ట పరిహారం అందించినట్లు అధికారులు లెక్కలు చెప్పారు. ఈ రోజు నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. వరద బాధితులకు నష్ట పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం. పావలాది రూపాయిన్నారకి కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కలెక్టరేట్ వద్ద బాధితులు ఎందుకు ఆందోళన చేస్తారు. కేంద్రం దగ్గర నుండి ఏమి తెచ్చారు. మరింత సహకారం కావాలని ఏమైనా అడిగారా? రీ ఎన్యుమరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

నిరాహార దీక్షలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ, గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహ‌న్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, తిరుపతి యాదవ్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *