Breaking News

డిమాండ్లు అంగీకారంతో స్విగ్గీ బాయ్ కాట్ పిలుపు ఉపసంహరణ… : ఏపీ హోటల్స్ అసోసియేషన్స్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
తమ డిమాండ్లను అమలు చేయడానికి స్విగ్గీ అంగీకారం తెలిపినందున అక్టోబర్ 14 నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ ప్రకటించింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్, స్విగ్గీ ప్రతినిధుల చర్చల అనంతరం గురువారం విజయవాడలోని భారతీనగర్, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల కార్యాలయంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన స్విగ్గీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, తమ డిమాండ్లను నవంబర్1లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. క్రేజీ డీల్స్ ఎత్తివేయడం, కమీషన్ తగ్గించడం, నగదును వెంటనే చెల్లించడం తదితర 12 ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలపడంతో స్విగ్గీ బాయ్ కాటు వాయిదా వేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *