Breaking News

ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రకటించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ పండుగ వేడుకల తరుణాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో, ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రకటించిందనీ మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి నుండి 2024 నవంబర్ 3వ తేదీ వరకు, కస్టమర్లు చేసే ప్రతి రూ.50,000 విలువైన కొనుగోళ్లతో పాటు, ఉచిత బంగారు నాణేలను పొందే అవకాశం ఈ ఆఫర్లు అందిస్తున్నాయన్నారు. ప్రతి రూ.50,000 విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 200 మి.గ్రా. బంగారు నాణెం, ప్రీషియస్, అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మి.గ్రా, బంగారు నాణెం, వజ్రాభరణాల కొనుగోలుపై 400 మి.గ్రా. బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ ఆఫర్లతో పాటు, కనీసం 10 శాతాన్ని ముందస్తుగా చెల్లించడం ద్వారా, కస్టమర్లు తమకు నచ్చిన ధనత్రయోదశి ఆభరణాలను ముందుగానే బుక్ చేసుకోవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నార న్నారు. దీనిద్వారా ఆభరణాలను బుక్ చేసిన రోజు ధర లేదా ఆభరణాలు కొనుగోలు చేసే రోజు ధర, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అదే ధరను చెల్లించడం ద్వారా సాధ్యమైనంత ఉత్తమ విలువను పొందడానికి వీలు కల్పిస్తుందన్నారు. మా వినియోగదారులు చేసే కొనుగోళ్లకు అదనపు విలువను అందించడం ద్వారా ఈ పండుగ సీజన్ యొక్క స్ఫూర్తిని వేడుకలుగా జరుపుకోవడానికి మా దీపావళి ఆఫర్ రూపొందించబడిందన్నారు. మా కస్టమర్లు సున్నితమైన మా ఆభరణాలతో మరియు మేము అందించే సువర్ణావకాశాలతో, ఈ ఏడాది పండుగ వేడుకలను మరింత ప్రకాశవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. అన్ని షోరూముల్లో ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ సేవలు పాత బంగారం వజ్రాల మార్పిడిపై 100 శాతం విలువ అందిస్తుందన్నారు. అన్ని రకాల ఆభరణాలు 100 శాతం హెచ్ యూఐడి ధృవీ కరించబడి ఉంటాయన్నారు. సామాజిక బాధ్యత పట్ల మలబార్ గ్రూప్ తమ కున్న నిబద్ధతను మరింత బలంగా చాటిచెపుతూ, తాము ఆర్జిస్తున్న లాభాల్లో 5 శాతం మొత్తాన్ని పర్యావరణ, సామాజిక, కార్యక్రమాలకు కేటాయిస్తుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *