మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో సోమవారం స్థానిక హిందూ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం కృష్ణాజిల్లాలో ఈరోజు 123 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 123 షాపులకు 2942 దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా రూ 58.84 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయని అన్నారు. జిల్లాలో అత్యధికంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో షాప్ నెంబర్ 117 కు 57 దరఖాస్తులు వచ్చాయని, తదుపరి ఉయ్యూరులో షాపు నెంబర్ 116 కు 52 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డిఓ కె స్వాతి, ఎక్సైజ్ స్టేషన్ ల వారి నియమించబడిన పరిశీలకులైన అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News