Breaking News

అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా విచారణ నిర్వహించి అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలని డి.ఆర్.ఓ కే చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అధికారులు ప్రజల నుండి వచ్చిన అర్జీలు గడుపులోగా పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని అర్జీ దారులతో మాట్లాడాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులలో సత్వరమే ఒకాలత్తులు ఫైల్ చేయాలన్నారు.

ఆర్టిఐ యాక్ట్ అమలకు సంబంధించి ప్రతి శాఖలో నోటిఫై చేయబడిన పి ఐ ఓ, ఏపీఐవో, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలు వెంటనే సమర్పించాలన్నారు. వివరాలు ప్రతి కార్యాలయంలో డిస్ప్లే చేయాలని, ఈ సమాచారం డిస్ట్రిక్ట్ పోర్టల్ లో కూడా పెడతామన్నారు. ప్రతి నెల 5వ తేదీలోగా ఆర్టిఐ పిరియాడికల్ రిపోర్టులు పంపాలన్నారు. కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉపకలక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుండి వచ్చిన అర్జీలు తగిన విచారణ నిర్వహించాలని, విచారణ నివేదికలను కలెక్టరేట్లో అర్జీల విభాగానికి పంపితే జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు ఫైల్ పెట్టడం జరుగుతుందని, కలెక్టర్ వారి ఆమోదంతో క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని జిల్లాలో అన్ని శాఖల అధికారులు అనుసరించాలన్నారు.

మీకోసంలో అందిన అర్జీలలో.. ..
తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామ పరిధిలో తాము పండించిన వరి, పసుపు పంటలు వరద ముంపుకు గురయ్యాయిని, నష్టపరిహారం అందలేదని మోర్ల సత్యనారాయణ, శివ పార్వతి, లుక్క శివ నారాయణ, రమాదేవి తదితర రైతులు మీకోసం లో అర్జీలు సమర్పించారు.

పెడన మండలం సేరివర్తులపల్లి, ముచ్చలిగుంట గ్రామానికి చెందిన రైతులు జన్ను నారాయణమ్మ, పుట్టి బ్రహ్మయ్య అధిక వర్షాలకు దెబ్బతిన్న వరి పంటకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు

స్థానిక కాలెఖాన్ పేటకు చెందిన తుమ్మ రాఘవులు ఆధార్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

ఈ సమావేశంలో డి యం హెచ్ ఓ డాక్టర్ జై గీతాబాయి, డీఈవో తహెరా సుల్తానా, హౌసింగ్ పీడీ ఎస్ వెంకట్రావు, ఉద్యాన శాఖ అధికారి జే.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, సిపిఓ గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *