Breaking News

మాస్క్ ధరించండి…మానవాళిని కాపాడండి…

-బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతము రాష్ట్రము, దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కదా అని ప్రతి మనిషి మాస్క్ ధరించకుండా సరదాగా వీధుల గుండా తిరుగుతున్నారు . అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను కలిసి నట్లయితే వందల మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 లో కరోనా వచ్చినప్పుడు కూడా అధికంగా మానవాళికి ప్రాణ నష్టం కలిగించినప్పుడు ప్రపంచమంతా భయంతో మానవాళి మాస్కులు ధరించే వారు కొంచెం తగ్గు ముఖం పట్టడంతో అందరూ వీధులలో షికార్లు చేయడంతో సెకండ్ వేవ్ ఒక్కసారిగా కరోనా వైరస్ ఉన్నట్టుండి ఎక్కువ మందికి ప్రాణ నష్టానికి గురిచేసింది . అప్పుడు భయభ్రాంతులకు గురై తిరిగి ప్రభుత్వము మాస్క్ దరించ కుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అంటే మాస్కులు ధరించడం జరిగినది . ఇప్పుడు తిరిగి మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు ప్రజలు. థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ అని సైంటిస్టులు వైద్యులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్చరిస్తున్నా ప్రజలు ఏమాత్రం అధికారుల మాటలు పెడచెవిన పెట్టి వినకుండా వీధుల గుండా తిరుగుతున్నారు . లాక్ డౌన్ ఎత్తివేయడం తో కరోనా పోయింది అనే భ్రమలో ప్రజలు ఉన్నారన్నారు . టీ కొట్టు, చిల్లర కొట్టు, బ్యాంకుల దగ్గర హోటల్ల దగ్గర బస్టాండ్ కూడల్ల లో ఏమాత్రం కోవిడ్ 19 నిబంధనలు పాటించడము లేదన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్లు వదలివేయడం తో అధికారుల మంచితనాన్ని చౌకబారు తనంగా చూసుకుంటున్నారు ప్రజలు. రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అందరూ మాస్కులు ధరించి రాబోవు రోజుల్లో ఎంతటి భయంకరమైన పరిణామాన్ని అయినా ఎదుర్కొనే శక్తి ఒక్క మాస్క్ మాత్రమే మానవాళిని కాపాడుతుందన్నారు. అత్యవసరము అనుకుంటేనే వీధుల్లోకి వెళ్లండి లేదంటే మీ కుటుంబంతో సంతోషంతో గడపండి లేదంటే మీ కుటుంబం వీధిన పడుతుంది అనే నిజాన్ని మర్చిపోవద్దు అన్నారు .

మాస్క్ దరిద్దాము… మానవాళిని కాపాడుకుందాం…
మాస్కు దరిద్దాము…మన కుటుంబాన్ని కాపాడుకుందాం…

అనే నినాదంతో ముందుకు నడవాలన్నారు . అందరం కలిసికట్టుగా ఉండి రాబోయే రోజులలో ఎంతటి భయంకరమైన వైరస్ ను తట్టుకునే శక్తి మన చేతుల్లోనే ఉందన్నారు . అతిగా వీధుల్లో తిరుగుతే ప్రభుత్వం మానవాళిని కాపాడడం కోసం తిరిగి లాక్ డౌన్ ప్రకటిస్తే సామాన్య ప్రజల నుండి అసామాన్య ప్రజల వరకు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశముందన్నారు. అన్నము లేక, నీళ్లు లేక ,ప్రయాణాలు చేయలేక బంధువుల చావులు కూడా కళ్లతో చూడలేకపోయిన రోజులు ఉన్నాయన్నారు . అందుకని ముందు జాగ్రత్తగా అవసరం లేకుండా జులాయిగా తిరగడంతో దేశ ప్రజలు అల్లకల్లోలం- అయోమయం లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలమైన మన అందరి మీద ఉందన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *