Breaking News

డాక్టర్ వీజీఆర్ హరితోద్యమానికి పదేళ్లు…

-డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ
-పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
-మొక్కలు నాటితే భావితరాలకు భరోసా కల్పించినట్లే…
-ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహవ్యాధికి అత్యాధునిక వైద్యం అందించడంతో పాటు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి గడచిన దశాబ్ద కాలంగా హరితోద్యమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ పర్యావరణ పరిరక్షకుల ప్రశంసలందుకుంటున్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించారు. కడియం పల్లా వెంకన్న నర్సరీ నుంచి రెండు వేల మొక్కలను తీసుకొచ్చి, రైతు దినోత్సవ సందర్భంగా మొగల్రాజపురంలోని వీజీఆర్ హాస్పిటల్ కేంద్రంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని, మొక్కల పెంపకం ద్వారా భావి తరాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను సేకరించి ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని వివరించారు. కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ కేర్ సెంటరుకు ఆక్సిజన్ ఫ్లోయింగ్ యూనిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లు అందజేశామని అన్నారు. మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టామని, విద్యార్థులకు రికార్డు స్థాయిలో వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించడంతో పాటు, స్కాలర్ షిప్ లను అందజేస్తున్నామని వెల్లడించారు. మధుమేహవ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారంతో డయాబెటిస్ అట్లాస్ ను రెండు సంచికలుగా ప్రచురించినట్లు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. తాము చేపట్టిన హరితోద్యమంలో ప్రకృతి ప్రేమికులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *