Breaking News

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం…

-ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లీడర్ డా.పి.గౌతమ్ రెడ్డికి సహకారానికి ధన్యవాదాలు
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్తు సమయంలో సహృదయంతో ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్బాష అన్నారు. శనివారం నగరంలోని రిమ్స్ జిజిహెచ్ లో గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ వారు వితరణ చేసిన 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 3 వేల ఎన్-95 ఫేస్ మాస్కులను, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లీడర్ డా.పి.గౌతమ్ రెడ్డి, గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డా.జాషువా డేనియల్ తో కలిసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా రిమ్స్ యాజమాన్యంకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ జిల్లా కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా దయాహృదయులైన గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ వారు తమవంతు సహాయం అందిస్తూ జిల్లా యంత్రంగానికి సహకారం అందించడం సంతోషకరం అన్నారు. ముందు నుండీ సమాజ సేవలో అడుగులేస్తున్న గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. జాషువా డేనియల్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ యూఎస్ఏ వారి సహాయం అభినందనీయం అన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో తమ మిత్ర బృందంతో కలిసి ప్రభుత్వానికి సహకరిస్తున్న ఎపిఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ లీడర్ పి.గౌతమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కోవిడ్ నియంత్రణ చర్యల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి విస్తృతమైన వైద్య సేవలు అందించిన రిమ్స్ వైద్య బృందానికి, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందికి అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.

నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్ విఫత్కర పరిస్థితిలో తమ దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ రోజు జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, పులివెందుల మొదలైన జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, ఎన్-95 మాస్కులను అందజేయడం ప్రశంశనీయం అన్నారు. వీరి సహకారంతోనే.. రిమ్స్ ఆవరణలో ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ జిల్లా సహాయక చర్యల్లో ఇప్పటికే ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి పలురకలుగా సాయం అందించారని.. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నామన్నారు. అంతేకాక ఎంతో మంది దాతలు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్స్ వితరణ చేస్తూ.. పలురకాలుగా కోవిడ్ కట్టడికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్నారని, వారందరికీ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు, రిమ్స్ సూపరింటెండెంట్ డా.ప్రసాద్ రావు, ఆర్.ఎం.ఓ.కొండయ్య, రిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమమునుకు విస్త్రుత ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందోబస్తు విధులు నిర్వహించు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బందోబస్త్ విధులపై పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *