పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 14 (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో రూట్ మ్యాప్ పై చర్చించి, క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనలు చేశారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ,జిల్లా ఎస్పీలతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భద్రత ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు . ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తోపాటు పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు, జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, జేసి కె.వెంకట రమణ రెడ్డి, పిఓ ఐటీడీఏ.. ఓ.ఆనంద్, ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ సి ఈ సుధాకర్ బాబు ,ఎస్ఇ నరసింహ మూర్తి ,జంగారెడ్డి గూడెం ఆర్దీవో వైవి.ప్రసన్న లక్ష్మి , మేఘా ఇంజనీరింగ్ జీఎం ముద్దు కృష్ణ ,మేనేజర్ మురళి , స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags polavaram
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …