100 మంది మహిళలకు కుట్టుమిషన్ లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63వ డివిజన్ రాజీవ్ నగర్ లో బుధవారం “వాసవి క్లబ్ ఇంటర్నేషనల్” వారి సౌజన్యంతో రాజీవ్ నగర్ వాసవి ఇంటర్నేషనల్ బిల్డింగ్ నందు మహిళల జీవనోపాధి నిమిత్తం 100 మంది మహిళలకు కుట్టుమిషన్ లు అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు మరియు అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోంది అని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని  అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగుతోంది అని… ఈ దీపావళి పండుగ నుంచి ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్‌ సిలిండర్లు’ ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుగారు మహిళలకు హామీ ఇచ్చారు అని, ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు అని… కుట్టు పని నేర్చుకున్న వారు తమ ఇంటి నుండే పని చేసి ఆదాయం పొందవచ్చు,ఆర్థిక స్వాతంత్ర్యం కుట్టు పని ద్వారా వచ్చే ఆదాయం వారికి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి సహాయపడుతుంది అని,కుట్టు పని చేసే వారికి సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది అని…

మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరగడం వల్ల పేదరికం తగ్గుతుంది అని, సమాజ అభివృద్ధి మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడటం వల్ల సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది అని బొండా ఉమ మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల గుత్తి గాయత్రీ, వేముల హాజరత్యయ్య గుప్త, సిద్ద సూర్యప్రకాష్ రావు, జిల్లా గవర్నర్ గణేష్, జిల్లా గవర్నర్ సతీష్, పేర్ల రవి, మోతుకూరి కాసిం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *