విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 60 డివిజన్ వాంబేకాలని మస్జిద్- ఎ- అసిరరి మసీదులో బుధవారం అయూబ్ ఖాన్ ఆద్వర్యంలో 500 మంది వృద్ధులకు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు చేతులమీదుగా ప్రారంభించి వారికి ఉచిత కళ్ళజోళ్ళు మందులు అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-పేదలకు అత్యాధునిక పరికరాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేయడంతో పాటు కళ్లద్దాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించాం అని… ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం లోని వాంబే కాలనీలో మహిళలందరికీ కూడా ఉచితముగా టెస్టులు చేసి కంటి చూపు కోల్పోవడం అనేది చిన్న పిల్లల వద్ద నుండి ముసలి వారి వరకు పెద్ద సమస్యని ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంపు నందు కంటిచూపు పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన వారికి ఉచితముగా కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగిందని..
ఈ సెంట్రల్ నియోజకవర్గం లోనే కాక జిల్లా వ్యాప్తంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఎంతోమందికి కంటి పరీక్షలు నిర్వహించి ప్రజలందరూ మెరుగైన వైద్యాన్ని అందుబాటులో ఉంచినది తెలుగుదేశం ప్రభుత్వమేనని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందుబాటులో ఉంచి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అయూబ్ ఖాన్ ఆద్వర్యంలో ఈ కళ్ళజోళ్ళ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నదని వారిని బొండా ఉమా అభినందించారు.
ఈ కార్యక్రమంలో:-కంచి ధన శేఖర్, M మల్లేశ్వరరావు, బేవర సూరి, మైనంపాటి సుబ్బలక్ష్మి, భుగత శ్రీరాములు, Sk భాష, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News