-మంత్రి సత్య కుమార్ కి అందజేత.
-ఎం. వెంకట కృష్ణ ను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి.
ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి బత్తలపల్లికి చెందిన విజ్ఞాన భారతి విద్యాలయ కరస్పాండెంట్ ఎం. వెంకట కృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం విజయవాడలోని సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేషీలో మంత్రి కి అందజేశారు. వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన వెంకట కృష్ణ తమ ఆర్థిక సహాయం ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు నేరుగా సహాయం చేయాలని సంకల్పించారు. సాటి మానవులు ఆపదలో ఉండగా ఆదుకోవడం తన బాధ్యతగా భావించి తనవంతుగా సహాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేసిన వెంకట కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సహాయం, వరద బాధితుల కోసం అవసరమైన తక్షణ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
Prajavartha Online Telugu News