పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యసాయి మహా సమాధి దర్శనం కోసం కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ శుక్రవారం శాంతిభవనకు విచ్చేశారు. శాంతిభవన్ అతిథి గృహమునందు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం పలికారు, బెంగళూరు నుంచి ఆయన రోడ్డుమార్గంలో ప్రత్యేక కాన్వాయ్ లో శుక్రవారం సాయంత్రం 5.15 నిమిషాలకు పుట్టపర్తి శాంతిభవన్ అతిథి గృహమునందు చేరుకున్నారు. ఆయనకు అధికారులు అనధికారులు స్వాగతం పలికారు ప్రస్తుతం సత్యసాయి మహా సమాధి దర్శనం చేసుకుంటున్నారు. కార్యక్రమంలో గోరంట్ల ఎమ్మార్వో, రంగనాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News