విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోటార్ సైకిల్‌ను లాంఛ్ చేసింది బజాజ్. ఫ్రీడమ్ 125 పేరుతో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్‌ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మరే ఇతర కంపెనీ సీఎన్డీ బైక్‌ను ఇంకా రూపొందించలేదు. అటువంటి బజాజ్ కంపెనీ నూతనంగా విడుదల చేసిన ప్రపంచపు మొట్టమొదటి సీఎన్జీ ఫ్రీడమ్ వాహనాన్ని వరుణ్ మోటార్స్ విజయవాడ డీలర్‌షిప్‌లో విడుదల అయిన 6 రోజులలోనే 100 వాహనాల రికార్డు అమ్మకాలు జరిగాయి. ఈ సందర్బంగా భవానీపురం బజాజ్ షోరూంలో 100వ వాహనాన్ని కొత్తపేటకు చెందిన కె.నవీన్ కుమార్ కొనుగోలు చేసి, కేక్ కటింగ్ చేయించి సెలెబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్ సీఈఓ పద్మజ, డిజిఎం వేమా శ్రీనివాస్, ఎజిఎం వెంకట్, మేనేజర్లు అమీర్, శ్రీహరి, సీఎన్జీ బంక్ ప్రతినిధులు రామకృష్ణ, శ్రీనివాస్, వరుణ్ మోటార్స్ సిబ్బంది మరియు కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News