Breaking News

ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండుగ వాతావరణం

-కోటి 30 లక్షల రూపాయల MGNREGs నిధులతో అభివృద్ధి పనులకు ఈ కారం చుట్టిన మంత్రి నాదెండ్ల

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో ఒక కోటి 30 లక్షల నిధులతో 11.050 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో మరో భారీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లెల అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. పల్లెలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.. దశలవారీగా గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులనుంచి కొల్లిపర మండలం 19 గ్రామాలకు తెనాలి మండలం 17 గ్రామాల సిసి రోడ్ల అభివృద్ధి పనులకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నిధులతో 21. 675 కిలోమీటర్ల సిసి రోడ్ అభివృద్ధి పనులకు చేపట్టున్నట్తు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు కొల్లిపర మండలంలో ఒక కోటి 30 లక్షల రూపాయల నిధులతో 11.050 కిలోమీటర్ల సిసి రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు.

కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్ నిర్మాణం, హనుమాన్ పాలెం గ్రామంలో రామాలయం వద్ద ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, తుమ్మలూరు గ్రామములోని మేరీ మాత ఆలయం వద్ద 15 లక్షల రూపాయలతో సిసి రోడ్ అభివృద్ధి పనులకు, సిరిపురం గ్రామం 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు, అత్తోట గ్రామంలో ఎస్బిఐ బ్యాంక్, ఒకటో వార్డు గ్రామ సచివాలయం వద్ద 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *