Breaking News

ఎలైట్‌ తెలుగు బ్రాహ్మిన్స్‌ ఉచిత నేత్ర వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఎలైట్‌ తెలుగు బ్రాహ్మిన్స్‌ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం జరిగింది. శుక్రవారం సత్యనారాయణపురం, గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌నందు ప్రజల కోసం సేవా దృక్పదంతో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎలైట్‌ తెలుగు బ్రాహ్మిన్స్‌ జనరల్‌ సెక్రటరీ జి.అశ్వినికుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా జి.అశ్వినికుమార్‌ మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అనే సిద్దాంతంతో ప్రకృతి వైపరీత్యాలలోనే కాకుండా ఎన్నో సందర్భాలలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించామని గతంలో 5 వేల వరద బాధిత కుటుంబాలకు 91,40,000 విలువ చేసే వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, పుస్తకాలు, బట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే సంధ్య కంటి ఆసుపత్రి, యాపిల్‌ దంత వైద్యశాల, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ కేరింగ్‌ సోల్స్‌ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్‌ చేయించి మందులు, కళ్ళజోళ్ళు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే చిన్న వయస్సు వారికి రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌, గ్లాకోమా, డయాబెటిక్‌ రెటినోపతి తదితర కంటి సమస్యలున్న వారికి పరీక్షలు ఉచితంగా నిర్వహించి సంబంధిత ఆసుపత్రి నందు డిస్కౌంట్‌లో చికిత్స చేయిస్తున్నామన్నారు. అదే విధంగా దంత పరీక్షలు ఉచితంగా నిర్వహించి వాటికి సంబంధించిన వైద్యాన్ని సంబంధిత ఆసుపత్రి నందు డిస్కౌంట్‌పై అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో ఇప్పటి వరకు స్థానికులే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చిన వారు సుమారు 200 మంది పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ జగన్మోహన్‌రాజు, అధ్యక్షులు చెరువు రామకోటయ్య, జోస్యుల వెంకట పవన్‌ శ్రీరామ్‌ తదితర సభ్యులు, సంధ్య కంటి ఆసుపత్రి, యాపిల్‌ దంత వైద్యశాల వైద్యులు, సిబ్బంది, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ కేరింగ్‌ సోల్స్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *