Breaking News

వక్ఫ్ పరిరక్షణ మహాసభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ పరిరక్షణ మహాసభ నవంబర్ 3వ తేదీన ఆదివారం సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.30 గంటల ముప్పై నిమిషాల వరకు విజయవాడలోని కుమ్మరిపాలెం ఈద్గా మైదానంలో మహాసభ జరుగుతుంది. వక్ఫ్ పరిరక్షణ మహాసభను జయప్రదం చేయాలని వక్ఫ్ పరిరక్షణ మహాసభ కన్వీనర్ సయ్యద్ లుఖ్మాన్ ఫార్ఖలీత్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం 2013లో సవరణలు చేయడానికి నిర్ణయించుకుందని దాని ఫలితంగా అనేక మార్పులు చేర్పులు ముందుకు వచ్చాయి.వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లింలు అయి ఉండాలనే షరతు ఉంది దీన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ముస్లిం మేతర అధికారిని సీఈఓ గా నియమించుకునే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వక్ఫ్ పరిరక్షణ మన బాధ్యత అని వారు అన్నారు.వక్ఫ్ పరిరక్షణ మహాసభను నవంబర్ మూడో తేదీన ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 9:30 వరకు విజయవాడలోని కుమ్మరపాలెం ఈద్గా మైదానంలోజమాఅతె ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వక్ఫ్ పరిరక్షణ (తహఫ్పుజ్ ఎ అవ్ కాఫ్) పేరుతో జరగబోయే ఈ భారీ మహాసభను విజయవంతం చేసి జాతీయ, సమాజ సమస్యలను పరిష్కరించడంలో మీ వంతు పాత్ర పోషించాలని యావత్ ముస్లిం సమాజానికి మా అభ్యర్థన అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీమ్, మంగళగిరి వక్ఫ్ పరిరక్షణ మహాసభ కన్వీనర్ ముహమ్మద్ యూసుఫ్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు అబ్దుర్రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *