-అవినీతి రహిత దేశంగా మన దేశం మారాలి
-2047 కి దేశంలో ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండాలనేదే లక్ష్యం
-నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ,సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విజిలెన్స్,జనరల్ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం నేషనల్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్,చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చింతపల్లి రమేష్, విజయవాడ డివిజనల్ మేనేజర్ ఎం.బి. వంశీ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ విజిలెన్స్ అవగాహన కార్యక్రమలు 31 జులై వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు ప్రతి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ ఆఫీసుల్లో కరప్షన్ ఎరాడికేషన్ గురించి ప్రజలందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్ కి విజిలెన్స్ అవగాహన కల్పించడం ద్వారా వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత కరప్షన్ చేయకుండా ఉండేందుకు అవగాహన కల్పించడం దీనిలో భాగంగా విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఎంపిక చేయడం జరిగిందని విజిలెన్స్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టడం గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందని ఇండియాలో కరప్షన్ లో ప్రపంచంలో 93వ స్థానంలో ఉందని యూరప్ కంట్రీస్ చిన్న చిన్న దేశాలు కరప్షన్ ఫ్రీ గా ఉన్నాయని ఆసియా దేశంలో సింగపూర్ కరప్షన్ ఫ్రీ గా ఉంది అని అవిదంగా అవినీతి రహిత దేశంగా భారత దేశం మారాలంటే యువత ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
వచ్చేవారం విశాఖపట్నంలో కూడా ఇదే తరహాలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం ఈ నినాదం ప్రజలందరికీ చేరాలి అదే మా భావన అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చింతపల్లి రమేష్ మరియు విజయవాడ డివిజనల్ మేనేజర్ ఎం. బి.వంశీ కిరణ్ , కాలేజీ, ప్రిన్సిపల్, లెక్చరర్స్ పాల్గొన్నారు.