Breaking News

‘బీసీ’ పథకాలకు నిధుల కొరత రానివ్వం

-మంత్రి ఎస్.సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టంచేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు అమలవుతున్నాయి…వాటి పురోగతి ఏ స్థాయిలో ఉందో..? అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులపైనా ఆరా తీశారు. బీసీ భవనాలు, కాపు భవనాల ప్రగతితో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపైనా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభివృద్ధి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో బీసీలకు అభ్యున్నతికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చనున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖలో అమలు చేసే పథకాలను నిధులు కొరత రానివ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ ఏ కులాల్లోని సంచార జాతుల కోసం చేపట్టబోయే పథకాలు గురించి అడిగి తెలుసున్నారు. సీడ్ పథకంతో సంచార జాతులకు ఎంతో మేలుకలుగుతుందన్నారు. ఈపథకంపై బీసీ ఏలో అవగాహ కల్పించాలన్నారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు కొంత మేర చెల్లించాలని, మిగిలిన బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

26 జిల్లాల్లోనూ డీఎస్సీ కోచింగ్ సెంటర్లు…
ఉద్యోగాల కల్పనలో బీసీ యువతకు వెన్నుదన్నుగా నిలిచే బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. త్వరలో జరగబోయే డీఎస్సీ పరీక్షకు సంబంధించి, 26 జిల్ల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదని, త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బీసీ స్డడీ సర్కిళ్ల ద్వారా అన్ని ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే కోచింగ్ సెంటర్లు నిర్వహించకుండా, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఆయా ఉద్యోగాలు, క్యాడర్ ను బట్టి బీసీ యువతకు కోచింగ్ ఇచ్చే ఆలోచన ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో బీసీ యువతకు సీఎం చంద్రబాబునాయుడు వెన్నుదన్నుగా ఉంటున్నారన్నారు.

కేంద్ర పథకాలకు నిధుల కొరత రానివ్వం
గత జగన్ పాలన రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోలేకపోయామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వమిచ్చే అన్ని పథకాలనూ వినియోగించుకోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయే కేంద్ర ప్రభుత్వాలకు ఎంతమేర రాష్ట్ర వాటా చెల్లించాలో చెబితే, ఇవ్వడానికి సీఎం చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీలకు మేలు కలిగే పథకాలకు నిధులు కొరత రానివ్వబోమని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *