Breaking News

కృత్రిమ ఉద్యమానికి… రాజకీయపు రంగు వర్గీకరణ కుట్ర

-మాలల మహాగర్జన నిర్వాహక సభ
-వర్గీకరణ ఆపకపోతే మాలల గర్జన తప్పదు
-నవంబరు 26 న మాలల మహాగర్జన
-నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా సభ
-రాజీకయం లబ్దికోసం వర్గీకరణ
-వర్గీకరణ మాధిగలకు కూడా నష్టం
-క్రిమిలేయర్ తో అందరూ నష్టపోతారు
-అఖిల భారత మాల జేఏసీ ఛైర్మన్ గా ఉప్పులేటి దేవీ ప్రసాద్
-నవంబరు 26న భారీ బహిరంగ సభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్పీ వర్గీకరణ కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉద్యమానికి…. రాజకీయంగా ప్రయోజనం పొందాలని కేంద్రం పన్నిన కుట్రలో భాగమే ఎస్సీవర్గీకరణ జరిగిందని విజయవాడలో జరిగిన మాలల మహాగర్జన బహిరంగ సభ నిర్వహణ సభలో మాల నాయకులు హెచ్చిరించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్పీ వర్గీకరణ చేయటం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతి హక్కులకు భంగం కలిగించటమని, అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడవటమే అని మాల సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు. అఖిల భారత మాల జేఏసీ ఛైర్మన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ సమాజానికి అన్యాయం చేయటానికే వర్గీకరణ కుట్ర పన్నారని అన్నారు. వర్గీకరణ అంశం రాష్ట్రాలకు అప్పగించటం సుప్రీంకోర్టు చేసిన రాజ్యాంగ విరుద్ధ నిర్ణయమని తెలిపారు. ఎస్సీ అనేది మొత్తం ఒకటే సమాజిక వర్గం అని దానిని విడగొట్టి రాజకీయకంగా లబ్ది పొందాలని చేసిన కుట్రలో భాగమే వర్గీకరణ తీర్పు అని అన్నారు. ఇది తీర్పు కాదని… కేవలం సూచన మాత్రమే అని… ఆ సూచన కూడా సక్రమంగా లేదని ఆరోపించారు. ఎస్సీలు కలిసి ఉంటే మాధిగ సోదరులు 15 శాతంలో పోటీ పడే అవకాశం ఉందని… దీని వల్ల అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. వర్గీకరణ జరిగితే మాధిగ సోదరులు 4 నుంచి 6 శాతం ఉద్యోగాలకు పరిమితం అయిపోతారని అన్నారు. అదే విధంగా ఎస్సీలో ఉన్నా అన్నీ కులాలకు అవకాశాలు పూర్తి స్థాయిలో కోల్పోతారని అన్నారు. ఆంధ్ర, తెలంగాణాలో కావాలనే కుట్ర జరుగుతుందని చెప్పారు. కులగణన జరక్కుండా, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే గణాంకాలు లేకుండా, సరైన వివరాలు లేకుండా వర్గీకరణ చేయాలని చూడటం అమానుషం అని దేవీప్రసాద్ అన్నారు. 2004లో వర్గీకరణను రద్దు చేస్తూ చెప్పిన తీర్పును ఇపుడు మళ్లీ దానిపై అవగాహన లేకుండా సూచన చేయటం అంబేడ్కర్ ఆశయాలను తూట్లు పొడవటానికే సూచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం కృత్రిమంగా ఒక నాయకుడిని తయారు చేసి దానికి కేంద్ర స్థాయిలో అమలు చేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ఈ వర్గీకరణ అంశాన్ని ఉత్తరాధిలో ఉన్న చమర్లు, ఆంధ్ర, తెలంగాణాలో ఉన్న మాధిగలు కూడా వ్యతిరిఖిస్తున్నారని తెలిపారు. దీనికి కారణం కేవలం దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయమే అని అన్నారు.
దీనిపై మాల సంఘాలు మాధిగ సోదరుల్లో కూడా పూర్తిగా అవగాహన కల్పించాలని దేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. దీనిపై మాలల మహాగర్జన పేరుతో రాజ్యంగా ఆమోద దినోత్సవం రోజున నవంబరు 26న భారీ బహిరంగా సభ నిర్వహించి ప్రభుత్వానికి వర్గీకరణ వ్యతిరేఖ ఉద్యమ బలాన్ని రాజకీయ నాయకులకు చూపిస్తామని హెచ్చరించారు.

ఇది మాలలపై దాడి కాదు… రిజర్వేషన్లపై దాడి
ఇది రిజర్వేషన్లపై దాడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరని మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో క్రిమిలేయర్ అనే దానిపై చర్చిస్తే కచ్చితంగా ఇది మాధిగ సోదరులకు కూడా అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక కుటుంబంలో ఉద్యోగం ఒకరు పొందితే ఇక ఆ కుటుంబంలో ఇంక ఎవరికీ ఉద్యోగాలు రావని తెలిపారు. దీనిపై మాధిగలు తెలుసుకోవాలని కోరారు. కుల గణన జరక్కుండా వర్గీకరణ కోసం ఎందుకు చర్చిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మరింత బలహీన పరుస్తున్నాయని తెలిపారు. ఈ వర్గకరణపై ఏదో మొక్కుబడిగా కమిటీలు వేసి అమలు చేయాలని చూస్తే… ఉద్యమిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరగబడతామని జడశ్రావణ్ కుమార్ హచ్చరించారు. న్యాయపరంగా పూర్తిగా తలుపులు మూసుకోలేదని… ఇది రాజకీయ నిర్ణయం కాబట్టి కచ్చితంగా రాజకీయంగా ఎదొరిడ్డి నాయకుల మొడలు వంచి మాలమాధిగల హక్కుల కాపాడుకుంటామని తెలిపారు
పంతగాని రమేష్ మాట్లాడుతూ తప్పుడు లెక్కలతో వర్గీకరణకు ఈ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. 2004లో కొట్టేసిన తీర్పును రాజకీయ కోణంలో వర్గీకరణ చేశారని అన్నారు. అఖిల భారత మాలసంఘం తరుపున కచ్తంగా ఎదుర్కొంటామని హెచ్చిరంచారు.
వర్కింగ్ కమిటీ ప్రెసెండింగ్ అశోక్ మాట్లాడుతూ నవంబరు 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున మాలలంతా రాష్ట్రంలో ఉద్యమిస్తారని తెలిపారు. దీని కోసం రాష్ట వ్యాప్తంగా ఇప్పటి నుంచి సన్నాహక సభలు నిర్వహించి భారీ సభతో సమర శంఖం పూరిస్తామని చెప్పారు. దీనికి అన్ని మాల సంఘాలు సన్నద్ధం అవుతున్నాయని తెలిపారు.
అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఏసీ అజెండా అంశాలతో కరపత్రాన్ని విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘాల ప్రతినిధులుత అన్నవరపు కిషోర్, పంతగాని రమేష్, తుమ్మాల ఫ్రాన్సిస్ రాజు తథితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *