-40వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చూసి ప్రజానీకం టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ముందడుగు వేస్తున్నారు. అంతే కాదు టిడిపి సభ్యత్వం కలిగి వుండటం ఒక గౌరవంగా భావిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లోని 40వ డివిజన్ భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్ తోపాటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న, టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, పాల్గొన్నారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపి కేశినేనిన శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపికేశినేని శివనాథ్ మాట్లాడుతూ గతంలో రూ.2లక్షలు వున్న ప్రమాద భీమాను రూ.5 లక్షలకి పెంపు చేయటం పై నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. తెలుగు తమ్ముళ్లందరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డ్ స్థాయిలో నిర్వహించాలని పిలుపు నిచ్చారు. రూ.100 సభ్యత్వంతో కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద భీమా, కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం తెలుగుదేశం పార్టీ అండగా వుంటుందన్నారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ రోజే మట్టిఖర్చుల కింద రూ.పది వేలు అందజేయటం జరుగుతుందన్నారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని సమయాల్లో తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ పార్టీ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య , తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ , శివశర్మ రు, సురభి బాలు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News