-సెంట్రల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
-తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్న ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని సమస్యలను పరిష్కారిస్తూ , రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నియోజకవర్గాల్లో రికార్డ్ స్థాయిలో అత్యధిక సభ్యత్వాలు సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ పైపుల రోడ్డు సెంటరు సమీపంలోని వాంబే కాలనీ రోడ్డు నందు శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపి కేశినేనిన శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంపి కేశినేని శివనాథ్ తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోగా ఎమ్మెల్యే బొండా ఉమా సభ్యత్వ కార్డ్ అందజేశారు. ఈ నియోజకవర్గంలో తొలి రెన్యువల్ సభ్యత్వంగా ఎమ్మెల్యే బొండా ఉమ నమోదు చేసుకోవడం జరిగింది…
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుగా సెంట్రల్ నియోజకవర్గానికే రావటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో తనకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. . అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా కృష్ణ జిల్లాలోనే అత్యధిక సభ్యత్వ నమోదు సెంట్రల్ నుంచే జరగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో తనకి, ఎమ్మెల్యే బొండా ఉమాకి ఎంత మోజార్టీ వచ్చిందో…ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు జరగాలని ఆకాంక్షించారు. టీడీపీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రల సంక్షేమం, తెలుగు జాతి ఉన్నతి, దేశ ప్రగతి కోసం పరితపించే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
అంతకు ముందు ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 70 వేల కి పైగా సభ్యత్వాలు నమోదు చేయించడమే లక్ష్యంగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించడం జరిగింది…
రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సభ్యత్వాన్ని తీసుకొని టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు వివరించారు, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే డివిజన్ బూతు క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశాన్ని నిర్వహించి
సభ్యత్వ నమోదు లక్ష్యంగా పని చేయాలని సూచించినట్లు చెప్పారు, అత్యాధునిక పద్ధతులు ఉపయోగించి నగదు రహితంగా క్యూఆర్ కోఢ్ విధానం ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని, టిడిపి రాష్ట్ర నాయకత్వం చెప్పేవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ పిరియా సోమేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, ఘంటా కృష్ణమోహన్ , సెక్రెటరీ మహమ్మద్ గౌస్, దాసరి ఉదయశ్రీ, అమర్నాథ్ గౌడ్, దాసరి కనకారావు, సుల్తానా, ఎస్.కె భాషా, సత్యనారాయణ, సూరి తదితరులు పాల్గొనడం జరిగింది..
Prajavartha Online Telugu News