మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇచ్చేలా ‘ వైస్సార్ జగనన్న స్మార్ట్ సిటీ’లను ప్రభుత్వం పెద్ద ఎత్తున తీర్చిదిద్దనుందని అందుకుగాను భూసేకరణకు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక శాఖ పరిధిలో పరిశీలించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, మచిలీపట్నం తాసిల్దార్ సునీల్ బాబుతో చాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను మధ్యతరగతి వర్గాలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్ల జిల్లావ్యాప్తంగా ఎంతో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వైఎస్సార్ జగనన్న ఎం ఐ జి స్మార్ట్ కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో మచిలీపట్నం అర్బన్ లో రెండు ,మూడు ప్రాంతాలలో 200 ఎకరాల భూమిని అలాగే గుడివాడ అర్బన్ లలో 400 ఎకరాల స్థలాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఇరు ప్రాంతాల రైతులతో మాట్లాడి చట్టప్రకారం వారికి న్యాయం చేస్తామన్నారు. భూమి కలిగిన రైతులకు కు తగిన నగదు అందచేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీరు , విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ఇలా అన్ని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సారిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వివరించారు.
Tags machilipatnam
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …