సంక్షేమ పథకములు లబ్దిదారులకు చేరువ చేయాలి… : ప్రాజెక్ట్ అధికారి డా.జె.అరుణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, బడుగు బలహీన వర్గ ప్రజలకు అండగా ఉండాలనే ఉదేశ్యంతో ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకములను ప్రవేశ పెట్టి విజయవంతముగా అమలు చేస్తున్నార‌ని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ & ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె.అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకముల యొక్క పురోగతిపై మంగ‌ళ‌వారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నందు ప్రాజెక్ట్ అధికారి డా.జె.అరుణ సి.డి.ఓ లు, సి.ఓ లు, సోషల్ వర్కర్స్ మరియు వార్డ్ వెల్ఫేర్ సెక్రటరిలతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అర్హులైన ప్రతి పేదవానికి ఈ పథకములను అందుబాటులో ఉంచేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించ కుండా అన్ని పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకురేలా చర్యలు తీసుకొని ఆదేశించారు. జగనన్న తోడు, వై.ఎస్.ఆర్ భీమా, వై,ఎస్,ఆర్ చేయూత, హౌసింగ్, వాహన మిత్ర, కాపు నేస్తం మరియు పెన్షన్ మొదలగు పథకములు ఎంత మందికి అందుతున్నాయి అడిగి తెలుసుకొన్నారు. సంక్షేమ పథకాలకు సంబందించి ప్రజల నుండి వచ్చే అర్జిలను స్వీకరించి సకాలంలో ఆయా శాఖలకు పంపించాలన్నారు.

మరణించిన సచివాలయ సిబ్బందికి పరిహారం…
నగర పరిధిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ కారణాల వల్ల మరణించిన ఇరువురు ఉద్యోగుల కుటుంబాల వారికీ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ఛాంబర్ నందు ఒక్కొక్కరికి రూ.25,000లు చెక్కును అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *