విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర సర్వతోముఖాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 64 వ డివిజన్ లో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ తో కలిసి NSC బోస్ నగర్, కండ్రిక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీధులలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు తొలగించి, సైడ్ డ్రెయిన్ లలో పూడిక తీయించాలని అధికారులను ఆదేశించారు. పార్కులు, అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య కేంద్రాల ప్రహరీల ఎత్తు పెంచి ఆవరణలో మొక్కలు పెంచాలని సూచించారు. మంచినీటి కుళాయిలకు ఎక్కడికక్కడ ట్యాప్ లను బిగించి నీటివృథాను అరికట్టాలని ఆదేశించారు. వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. వీఎంసీ, కార్పొరేటర్, సచివాలయ వ్యవస్థ సమన్వయంతో ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ 14, 15 వ ఆర్ధిక సంఘం నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ ప్రగతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలోని కాలనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మరోవైపు 64వ డివిజన్ పరిధిలోని 3 పార్కుల సుందరీకరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. త్వరలోనే డివిజన్ ను ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుబోతున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శ్రీరాములు, జిల్లేల్ల శివ, అక్కిశెట్టి నారాయణ, ఎస్.కే.ఇస్మాయిల్, విమల చిన్నారి, లత, దేవిరెడ్డి సంజీవరెడ్డి, సాదం శ్రీను, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …