Breaking News

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ పాలన సాగిస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 5 వ డివిజన్ సున్నంబట్టీల సెంటర్ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మార్గదర్శనం లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ,అదేవిధంగా అభివృద్ధి పనులు పర్యవేక్షణ కొరకు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. ఈ డివిజన్ లో కొండ ప్రాంతం అధికంగా ఉంది అని అందుకే ఈ ప్రాంత అభివృద్ధి కి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి నూతన మెట్లు, రైలింగ్ ఏర్పాటు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కొరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ అంబేద్కర్ మంచినీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని కోరగా వెంటనే కమిషనర్  3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి ఇంటి ఇంటికి మంచినీరు అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.స్థానిక ప్రజలు కమ్యూనిటీ హల్ అవసరం గురించి అవినాష్ దృష్టికి తీసుకురాగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హల్ నిర్మిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని,వారి అధినాయకుడు దృష్టిలో పడి రోజు పేపర్ లో పేరు రావాలని అసత్యాలు ప్రచారం చేస్తూ జగన్ ని విమర్శిస్తే లబ్ది పొందిన మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మీ పరిపాలన తో విసుగు చెందే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని,వైస్సార్సీపీ పార్టీకి అఖండ విజయం అందజేశారని, అయినసారే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ప్రజలను పట్టించుకోకుండా వారికి జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని చూస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు అని అన్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు విఠల్, లాంకిరణ్, చోడేష్, లోకేష్, రత్నంరాజు,  బలస్వామి, సౌజన్య,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *