Breaking News

ప్రధాన డ్రైన్లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పెరుగతున్న ట్రాఫిక్, జనాభా అవసరాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం పుర ప్రముఖుల అభ్యర్ధనల మేరకు విజయవాడలోని బుడమేరు సంఘటన గుంటూరులో ఉత్పన్నం కాకుండా గుంటూరు నగరపాలక సంస్థ నగరంలోని ప్రధాన డ్రైన్లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం కమిషనర్ గారు అమరావతి రోడ్, నంది వెలుగు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నలంద నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  తొలుత అమరావతి రోడ్ లో జరుగుతున్న డ్రైన్, రోడ్ల ఆక్రమణలను పరిశీలించి, ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో సిల్ట్ తీయాలన్నారు. ఒకసారి తొలగించిన ఆక్రమణలు తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. బస్టాండ్ ఎదురు ఆక్రమణలు తొలగించడంతోపాటు ప్రకటనల హోర్డింగ్స్ డ్రైన్ కి ముందుకు రాకూడదని, వెంటనే తొలగించాలన్నారు. ఆక్రమణదారులకు 2 రోజుల్లో తొలగించుకోవాలని ముందుగా తెలియ చేసి, సోమవారం నుండి పూర్తి స్థాయిలో తొలిగించడానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సదరు ప్రాంతంలోని రైతు బజార్ కి వచ్చే వినియోగదార్ల వాహనాలు రైతు బజార్ ప్రాంగణంలోనే పార్క్ చేసేలా భాధ్యత తీసుకోవాలన్నారు. నందివెలుగు రోడ్ విస్తరణ చేసినప్పటికీ ఆక్రమణలు వలన ఉపయోగం లేకుండా ఉందని, తక్షణం ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని తొలగించాలని ఏసిపిని ఆదేశించారు. బస్టాండ్ ఎదుట ట్యాక్సీవాలాలు, ఆటో డ్రైవర్లతో వాళ్ల స్టాండ్ లో నేరుగా మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతంలో అధిక ట్రాఫిక్ ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలన్నారు.
అనంతరం నలంద నగర్ లో స్థానిక కార్పొరేటర్ మానం పద్మశ్రీ కలిసి పర్యటించి, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. నలంద నగర్ మెయిన్ రోడ్ లో కల్వర్ట్ కుంగి పోవడం వలన మురుగు సక్రమంగా వెళ్లడంలేదని, తక్షణం నూతన కల్వర్ట్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అపార్ట్మెంట్ల ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో ఈఈలు కోటేశ్వరరావు, సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు,ఏసిపి రెహ్మాన్, జాతీయ వినియోగదార్ల సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ సిహెచ్.హరిబాబు, డిఈఈ రమేష్, ఏఎంహెచ్ఓలు ఆనందకుమార్, రాంబాబు, టి.పిఎస్.లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *