Breaking News

సోమవారం వీధి వ్యాపారుల సంఘాలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కొరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు వీధి వ్యాపారుల సంఘాలతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని నగర కమీషనర్  పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రథాన రోడ్లు అంతర్గత రోడ్లు వివిధ డ్రైన్ల పై కూడా వీధి వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన డ్రైన్ల పూడిక తీత పనులకు ఆటంకం ఏర్పడుతున్నందున తేలికపాటి వర్షానికే రోడ్లు వర్షపు నీరు నిలబడి ప్రజలు అవస్తలు పడుతున్నారని, మురుగు నీరు పారుదలకు ఆటంకం ఏర్పడుతున్నారు. నగర పాలక సంస్థ దఫాల వారీగా నగరంలోని డ్రైన్ ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు. ఆక్రమణల తొలగింపు వీధి వ్యాపారుల సమస్యల పై చర్చించడానికి సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశానికి వీధి వ్యాపార సంఘాల ప్రతినిధులు హాజరుకావాలని కమీషనర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *