Breaking News

డూండీ రాకేష్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెల‌ప్మెంట్ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన డూండీ రాకేష్ కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను డూండీ రాకేష్ మ‌ర్యాద పూర్వ‌కంగా ఆదివారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డూండీకి అభింద‌న‌లు తెల‌ప‌టంతో పాటు పార్టీతో పాటు ప్ర‌జ‌ల‌కి మ‌రింత సేవ చేసి రాజ‌కీయంగా మ‌రింత ఉన్న‌త ప‌ద‌వులు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. పార్టీ క‌ష్ట కాలంలోనూ పార్టీని అంటి పెట్టుకుని చంద్ర‌బాబు నాయుడిని ముఖ్య‌మంత్రి చేసేందుకు డూండీ రాకేష్ త‌న వంతు కృషి చేశాడ‌ని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయ‌కులు వ్యాపార‌స్తుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటే ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూ.. వ్యాపార‌వ‌ర్గాల‌ను ఏకం చేయటంలో కీల‌క‌పాత్ర పోషించాడ‌న్నారు. త‌న‌కి అభినంద‌న‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు డూండీ రాకేష్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులకి ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కార్మికులు, వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు ద్వారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *