Breaking News

భారత రత్న అబుల్ కలాం ఆజాద్ సేవలు అనిర్వచనీయం

– విద్యారంగానికి ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తి
– మైనార్టీల సంక్షేమానిక ఏటా రూ. 365 కోట్ల ఖర్చు
– మైనార్టీల సంక్షేమానికి ఆధ్యులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
-2014-24 వరకు 14 లక్షల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ
– రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్. డీ ఫరూక్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. మైనార్టీల అభివృద్ధికి భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చూపిన మార్గంలో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్. డీ ఫరూక్ తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత రత్న అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగం మరియు మైనార్టీ సంక్షేమానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ముస్లింల అభివృధ్ది సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుల్హన్, రంజాన్ తోఫా తదితరమైన పథకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉర్ధూను సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించి, రోషిణీ పథకం క్రింద ఉర్ధూ పాఠశాలలను ఎక్కువగా స్థాపించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 ఎకరాల్లో హైద్రాబాద్ లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్శిటీని స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేనన్నారు. 2015 లో కర్నూలు లో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్ధూ యూనివర్శిటీ, కడపలో హజ్ హౌస్ ను ఏర్పాటు చేసామన్నారు. ఆరోజుల్లోనే అల్ప సంఖ్యాకులైన మైనార్టీల అభివృద్ధికి నిరుద్యోగుల ఉపాధికి దుఖాన్, మకాన్ పథకం క్రింద సబ్సిడీ పై రుణాలను అందించి ఉపాధి కల్పించామన్నారు. రాష్ట్రంలోని మౌజమ్స్, పాస్టర్లకు ఇచ్చే పారితోషికం నిధులను త్వరలోనే విడుదల చేయనున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి, విద్యా పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు. ఎల్లప్పుడూ మైనార్టీ వర్గాలకు మంచి చేయాలని ఆలోచించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి ఎన్. ఎండీ. ఫరూక్ పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యా రంగంలో దేశానికి అబుల్ కలాం ఆజాద్ చేసిన త్యాగాలు, చేసిన సేవలు మరచిపోలేమన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలు ఫలితమే మనం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోగలుగుతున్నామన్నారు.. అలాంటి మహనీయుని సేవలు అద్వితీయమని వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఆయన చూపిన బాటలో పయనించడమేనన్నారు. దేశంలో పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. మైనార్టీల్లోని పేదలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు.. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు పేదలకు అందిస్తున్నామన్నారు.. సూర్యఘర్ కింద పేదలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.. తల్లికి వందనం పథకం కింద సహాయం అందిస్తామన్నారు.. హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధుల పేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నామన్నారు. పేదరికంలో ఉన్న వారికి ముఖ్యంగా మైనారిటీలకు అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.. మైనార్టీ సంక్షేమానికి దాదాపు రూ. 365 కోట్లకు పైగా రాష్ట్రంలో ఏడాదికి ఖర్చు చేస్తున్నామన్నారు.. విదేశాల్లో విద్యనభ్యసించే వారికి ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.. కేంద్ర ప్రభుత్వ సీకో ఔర్ కమానో పథకం కింద ఇంటికే పరిమితమైన మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు.. ఇలా 2014 నుంచి 2024 వరకు 13 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించామన్నారు.. మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయన్నారు.. శాసన మండలి మాజీ చైర్మన్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్ మహ్మద్ అహ్మద్ మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రిగా ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసిన వ్యక్తి భారత రత్న అబుల్ కలాం ఆజాద్ ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు దేశానికే తలమానికమన్నారు. నాడు ఆయన చూపిన మార్గం నేడు ఎంతో మందికి ఆదర్శమన్నారు. మైనార్టీ వర్గాల పిల్లల చదువు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుక అవకాశాలు కల్పించారన్నారు. ముస్లింలకు చేయూత నిచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, మానవ సేవే మాధవ సేవ అని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి అని అన్నారు. గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీల హక్కుల కోసం ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం అని అన్నారు. భారత దేశంలో ముస్లిం మైనార్టీ హక్కుల కోసం పనిచేసిన వ్యక్తి , దేశానికి విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి భారత రత్న అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీల కోసం రాబోయే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చే పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు రాజబాట ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తిరువూరు శాసనసభ్యులు కే. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక నాయకుడి జన్మదినాన్ని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారంటే ఆయన దేశానికి చేసిన గొప్పతనాన్ని చూడాలన్నారు. భారత రత్న అబుల్ కలాం ఆజాద్ గొప్ప నాయకత్వ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపి జాతిని జాగృతం చేసిన వ్యక్తి ఆజాద్ అన్నారు. ఒక జర్నలిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారన్నారు. మదనపల్లి శాసనసభ్యులు షాజుద్దీన్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన వ్యక్తి ఆజాద్ అని కొనియాడారు. మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తొలుత ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, నాయకులు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె. హర్షవర్ధన్, కమిషనర్ సిహెచ్. శ్రీధర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ మస్తాన్, మైనార్టీ వర్గాల మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు..

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *