-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్లి పరిశీలించాలని
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన సమస్యలకు శాఖధిపతులు స్వయంగా తామే ఫీల్డ్ లో పరిశీలించి సమస్యను సత్వరంగా పరిష్కరించాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆక్రమణలు, సుందరీ కరణ, నేటి కులాయి, సిసి రోడ్, భూగర్భ డ్రైనేజీ, డ్రైన్ కల్వర్టలు, ఇంటి పట్టా, ఆస్తి పనులు లో డోర్ నెంబర్ సరి చేయుట, డ్రైనేజ్ తదితర సమస్యలపై ఫిర్యాదులను అందుకున్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగంలో నాలుగు ఫిర్యాదులు అందగా, ప్రజా ఆరోగ్యంలో మూడు రెవెన్యూలో రెండు, మొత్తంగా సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జీ వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యనారాయణ కుమారి, జాయింట్ డైరెక్టర్ మరియు ఇన్చార్జి పి. ఓ. (యు సి డి)డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డీఎఫ్ఓ మల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News