-“ప్రతి కుటుంబం- ఒక ఔత్సాహిక వ్యాపారస్తులు”
-జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి SHG ప్రొఫైలింగ్
-ప్రతి ఒక్క సభ్యురాలి కుటుంబం మరింత మెరుగైన ఆదాయం సముపార్జించేలా ప్రణాళికలు
-మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్దిశా నిర్దేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటిలలో ఉన్న 28,77,019 మంది పేద నిరుపేద మహిళలను 2.79 లక్షల సంఘాల ద్వారా సంఘటితం చేసి వారి సామాజిక ఆర్ధిక సాధికారత కొరకు కృషిచేస్తున్నాము.
దీనిలో భాగంగా సంఘాలు మరియు సమైఖ్యల కార్యకలాపాలు పూర్తిస్థాయి పారదర్శకంగా నిర్వహించి తద్వారా సంఘ సభ్యుల ఆర్ధిక వికాసానికి తోడ్పడేటందుకు SHG ప్రొఫైలింగ్ అనే ప్రక్రియను మెప్మా సంస్థ చేపట్టడమైనది.
దీనిలో SHG మరియు సంఘ సభ్యుల సమగ్ర సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరించి, దానిని నాలుగు స్థాయిలలో సంబంధిత సిబ్బందిచేత తనిఖీ చేసి వాస్తవ సమాచారాన్ని సేకరించేలా ప్రణాళికచేయడమైనది.
సంఘాల నిర్వహణా స్థితి, పొదుపులు, అప్పులు, చెల్లింపులు, రానిబాకీలు, అడ్వాన్సులు వంటి ఆర్ధిక అంశాలతో పాటు సంఘ స్థాయిలో చేపడుతున్న జీవనోపాధుల వివరాలను తెలుసుకోవడం ద్వారా సంఘం ప్రస్తుత స్థితిని బట్టి గ్రేడింగ్ ఇవ్వబడుతుంది. సంఘ గ్రేడింగ్ స్థాయిని బట్టి వాటికి భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించుటకు తగు చర్యలు తీసుకోవడమైనది.
సభ్యుల స్థాయిలో వారి ఆర్ధిక, సామాజిక అంశాలతో పాటు జీవనోపాధి వివరాలు మరియు ఆదాయ వివరాలను సేకరించి తద్వారా ఆదాయస్థితిగతుల ఆధారంగా ప్రతి ఒక్క సభ్యురాలి కుటుంబం మరింత మెరుగైన ఆదాయం సముపార్జించేలా ప్రణాళికలు రూపొందించడమైనది.
ప్రభుత్వం నిర్దేశించినట్లు “ప్రతి కుటుంబం- ఒక ఔత్సాహిక వ్యాపారస్తులు” అనే అంశంలో భాగంగా ప్రతి సంఘ సభ్యురాలిని వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి వర్గీకరించి తక్కువ స్థాయిలో ఆదాయం ఉన్న సభ్యులకు తక్షణం వారి నైపుణ్య మెరుగుదల చేసి వారి సామర్ధం ఆధారంగా మరింత మెరుగైన ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించేలా చర్యలు తీసుకోబడతాయి.
అలాగే అత్యున్నత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్న సంఘ సభ్యులను గుర్తించి వారిని MSME పాలసీలో నిర్దేషిణ లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమలను ప్రారంభించేలా సంబంధిత శాఖల సమన్వయంతో తగు చర్యలు తీసుకోబడతాయి.
ఈ SHG ప్రొఫైలింగ్ అనేది సంఘాల సభ్యుల మధ్య పారదర్శకతను పెంపొందించి ప్రతి సంఘ సభ్యురాలు/ సభ్యుడు వారి వారి సామర్ధ్యం నైపుణ్యం ఆధారంగా మరింత మెరుగైన స్థితికి చేరేలా చేయుటకు నిర్దేశించిన అద్భుతమైన టూల్. దీనిద్వారా కేంద్రరాష్ట్ర పధకాల అమలులో కచ్చితత్వం తీసుకొచ్చి పేదరికం నిర్మూలనకు బాటలు వేసి జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి SHG ప్రొఫైలింగ్ మొదటి మెట్టుగా పనిచేస్తున్నాము.
ది.08-11-2024 నుండి ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా RPలతో పాటు సమాచారం సేకరించి డిసెంబర్ నెలలో డేటా వ్యాలిడేషన్ ను పూర్తిచేస్తాము.