Breaking News

జిల్లాలో 3 ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక : జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 3 ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి ఇసుక స్టాక్ యార్డ్ కు సంబంధించిన లాటరీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా ఆవిలాలకి సంబంధించిన లీల ఎంటర్ప్రైజెస్ స్టాక్ యార్డ్ శ్రీమతి పి శైలజ, కాటన్ మిల్ కు సంబంధించి పి శ్రీనివాసులురెడ్డి, గాజుల మాన్యం రేణిగుంట మండలం సంబంధించి తిష్య కన్స్ట్రక్షన్స్ శ్రీ కే శ్రీనివాసులను లాటరీ పద్ధతి ద్వారా వీరిని ఎంపిక చేయడం జరిగింది అని అన్నారు. ఐదు రోజులు లోపల ఇసుకను అందుబాటులో తేవాలనీ, ప్రజలందరికీ ఇసుక లభ్యత అందుబాటులో ఉంటుందని తెలిపారు.

స్టాక్ యార్డ్ వద్ద ఇసుక అందుబాటులో ఉన్న రెట్లు
కాటన్ మిల్ దగ్గర పెట్టుకున్నటు వంటి కాటన్ మిల్లు డిపో కి టంగుటూరు గ్రామం నందులూరు మండలం అన్నమయ్య జిల్లా నుంచి ఇసుకను తెప్పించుకుని రూ. 640 అందుబాటులో ఉంచుతున్నారు.

రేణిగుంట గాజులామాండ్యం దగ్గర టన్ను రూ .675 గా నిర్ణయించారు.

తిరుపతి రూరల్ అవిలాల దగ్గర ఇసుక టన్ను రూ .640 గా నిర్ణయించారు.

నిర్ణయించిన ధరలకంటే ఇసుకను ఎక్కువ రేటుకు అమ్మ రాదని అమ్మినట్లు ఫిర్యాదులు అందినచో డీలర్ షిప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు టాలెంట్ టెస్ట్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *