Breaking News

Tag Archives: amaravathi

ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

-280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ -సెకండరీ హెల్త్ లో 97 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ -డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం -రెగ్యులర్‌ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ -అభ్యర్థుల అర్హతలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్‌లో వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 …

Read More »

రాష్ట్రంలోని పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

-రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని నిర్ణయం -కాకినాడ పోర్టులో అయిదు వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఏర్పాటుపై విచారణకు ఆదేశం -రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం -పోలీస్, రవాణా, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ …

Read More »

భూపతిరాజు సూర్య నారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్

-కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటన భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : నా తండ్రి భూపతిరాజు ‌సూర్యనారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. పార్లమెంటు సభ్యుడు గా వచ్చే బెనిఫిట్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తానని తన తండ్రి ‌సం‌స్మరణ సభలో ప్రకటించారు. బిజెపి కార్యకర్త గా ప్రస్తానం ప్రారంభించి తండ్రి ప్రోత్సాహం తో ఈ స్థాయికి చేరుకున్నాను అన్నారు. మా కుటుంబం స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబం …

Read More »

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్

-మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ -ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం -ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు సీఎం విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి …

Read More »

మైనారిటీ సంక్షేమ శాఖ జీవో-47 ఉపసంహరణ

-వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ …

Read More »

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు చేస్తూ ప్రభుత్వ జీవో ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తెలిపారు. ఇప్పటివరకు పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు కాగా, ఒక సంవత్సరం పెంచి పదవీ విరమణ వయసును 61 గా జీవో జారీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ ఉత్తర్వులు 1-11-2024 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు.

Read More »

షిర్డీలో తెలుగు సదస్సు ప్రారంభించిన బుద్ధప్రసాద్

-విచ్చేసిన సినీ నటుడు సాయికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షిర్డీ మహానగరంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో షిర్డీ తెలుగు సంఘం సహకారంతో జాతీయ తెలుగు భాషా సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. అవనిగడ్డ ఎమ్మెల్యే, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. హైదరాబాద్ నుండి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, రచయిత జీవీ పూర్ణచందు విచ్చేశారు.

Read More »

సత్యం విలువను తెలుసుకుని నడుచుకోవాలి

-సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ -టాప్ హాట్స్ అండ్ టెయిల్ కోట్స్ పుస్తకావిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యం ఎంతో గొప్పదని దీని విలువను తెలుసుకొని నడుచుకోవాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ఏయు హిందీ విభాగం సమావేశ మందిరంలో డాక్టర్ ప్రయాగ మురళి మోహనకృష్ణ రచించిన టాప్ హాట్స్ అండ్ టెయిల్ కొట్స్ అంగ్లాగ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చిన విదేశీ …

Read More »

సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తాం

-రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం -సాంకేతికతను అనుసంధానం చేసి సెల్ ఫోన్ ల ద్వారా పౌర సేవలు అందజేస్తాం -రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, గంజాయి మాఫియాలు లేకుండా చేస్తాం -పీఎం సూర్య ఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ అందిస్తాం -రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇచ్చి.. అందుకు తగ్గ కార్యచరణను కూడా రూపొందిస్తాం -రాయదుర్గం ప్రాంతాన్ని ఎడారికీకరణ కాకుండా చర్యలు తీసుకుంటాం -జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం.. -లబ్ధిదారులు 1, 2 నెల పెన్షన్లు …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ఫెయింజల్ తుపాను కారణంగా రైతులకు అందుబాటులో ఉండాలి- మత్స్యకారులు తుపాను ప్రభావం తగ్గే వరకు వేటకు వెళ్లకుండా చర్యలు- -తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికారులు సెలవు పెట్టవద్దు – -కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫెయింజల్ తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులందరూ రైతులకు …

Read More »