-చిత్తశుద్ధి, ప్రజలకు జవాబుదారిగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది -డిఎస్సీపై ఎడాది పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు రాద్ధాంతం చేయడం హస్యాస్పదం -స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పబ్లిక్ డోమైన్ లో ఉంచాము -అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిఎస్సీ 2025ను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు వంగలపూడి అనిత అన్నారు.ఏపీ సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు జవాబుదారిగా పని చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం కనీసం ఒక్క …
Read More »Tag Archives: amaravathi
పుష్కరాల కోసం రూ.5.63 కోట్లతో 3 స్థానిక ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి
-కొవ్వూరు, నిడదవోలు, మండపేట ఆసుపత్రుల్లో అదనపు సౌకర్యాలు -ఆమోదించిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాల్లో భారీ స్థాయిలో పాల్గొనే ప్రజల వైద్యావసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 సెకండరీ ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరు లోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు మరియు మండపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం రూ. 5.63 కోట్ల వ్యయంతో ప్రణాళికను వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ …
Read More »ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలు
– ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఏపీ ప్రకృతి వ్యవసాయం – ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ సాధించిన APCNF… ప్రకృతి వ్యవసాయంలో ఏపీకి విశిష్ట స్థానం – దేశానికే గర్వకారణమైన ఈ గౌరవాన్ని మహిళలు, రైతులకు అంకితం చేస్తున్నాం – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, రైతాంగ అంకితభావానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య …
Read More »సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు
-ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం -పుణ్య స్నానాలకు 10 కోట్ల మంది వస్తారని అంచనాలు -6 జిల్లాల్లో కొత్తగా 237 ఘాట్లు నిర్మించాలని ప్రతిపాదనలు -త్వరలో పుష్కర లోగో విడుదల – విస్తృతంగా ప్రచారం -గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున …
Read More »ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్ పెడదాం
-జిల్లాల్లో పరిష్కారం కాని ఇళ్ల సమస్యలను కెబినెట్‌కు తీసుకురండి -గృహనిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దృష్టి పెట్టండి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంత వరకు చేయగలరో చేయాలని… జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ కుదరన పక్షంలో కెబినెట్‌కు తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని …
Read More »రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
– భూసార పరిరక్షణకు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం – రైతులకు పెట్టుబడి భారం తగ్గించి అధిక దిగుబడులే లక్ష్యం – పచ్చిరొట్ట సాగుతో నేల సారం పెంపు, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి …
Read More »జూన్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు కేరళంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
-కేరళం పర్యటనకు బయల్దేరిన మంత్రి కందుల దుర్గేష్..’బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా నిలిచిన ఏపీ ఎంపికైన నేపథ్యంలో జూన్ 4న జీటీఎం ఎక్స్ పో -2026లో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్న మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికతకు దక్కిన అరుదైన గౌరవంగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్ -కూటమి ప్రభుత్వ పర్యాటక సంస్కరణలకు జాతీయ గుర్తింపు రావడంపై హర్షం.. ‘బ్రాండ్ ఏపీ’కి దక్కిన అరుదైన పురస్కారంగా అభివర్ణన -నూతన టూరిజం పాలసీ, పారిశ్రామిక హోదాతో మారిన గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై అదరగొట్టిన …
Read More »అమరావతి అంతర్జాతీయ చెస్ పోటీలకు మంత్రికి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో జూన్ 3న నిర్వహించనున్న 1వ అమరావతి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ టోర్నమెంట్స్–2026 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని ముఖ్య అతిథిగా టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మంత్రి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరచనున్నారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభివృద్ధికి ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు …
Read More »‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక అంతర్గత కమిటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా విశ్వమానవతా భావాలను స్మరించుకుంటూ, కులాలను కలిపే ఆలోచనా విధానం మరియు మత ప్రస్తావనలకు అతీతమైన బాధ్యతాయుత రాజకీయాలు జనసేన సిద్ధాంతాల్లో …
Read More »మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది
– మనబడి పిలుస్తోంది పాట ఆవిష్కరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్. – విద్య ఆవశ్యకతను పాటలో వినిపించారు – ఏపీఎస్సీపీసీఆర్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్. ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక …
Read More »
Prajavartha Online Telugu News