Breaking News

Tag Archives: amaravathi

రానున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాం : మంత్రి ఆనం

-తక్షణమే పుష్కరాల ఏర్పాట్లకు దేవాదాయ శాఖ బ్లూప్రింట్ సిద్ధం చేయాలి : మంత్రి ఆనం -ఆరు జిల్లాల్లో నది పరివాహక ప్రాంతాల్లో ఆలయల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మంత్రి ఆనం -దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా, మహా కుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం …

Read More »

గోదావరి పుష్కరాల్లో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలి

-వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న ప‌విత్ర‌ గోదావరి పుష్కరాల్ని పురస్కరించుకుని వైద్య సేవల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరాల్ని నిర్వహించాలని స్పష్టంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రైట్‌ టు సైట్‌ సొసైటీ’ గవర్నింగ్ బాడీ సమావేశం వెల‌గ‌పూడిలోని ఏపీ సచివాలయంలో 11 ఏళ్ల అనంతరం తొలిసారిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన …

Read More »

ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటాలి

-ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు జరపాలి -వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల ఆసుపత్రుల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, ఆరోగ్య సంస్థల్లో సుస్థిర విధానాల అమలుపై అవగాహన కల్పించాల‌ని పేర్కొన్నారు. పర్యావరణ …

Read More »

కిడ్నీ రోగులకు స్వాంతన

-పరస్పర మార్పిడి (స్వాప్) విధానంలో సమీప బంధువుల నుంచి ‘కిడ్నీ’లు స్వీకరించేందుకు మంత్రివర్గం ఆమోదం -ప్రస్తుతం కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే పొందే అవకాశం -కిడ్నీలను తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు కూడా ఇవ్వొచ్చు.. -రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీ(మూత్ర పిండం) బాధిత రోగులకు అవయవ మార్పిడి విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. అవయవాల స్వాప్ (పరసర మార్పిడి) విధానానికి కూటమి ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ఒక కటుంబంలోని …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1387 వ (50వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. వ్యవసాయం & సహకారం 1.వ్యవసాయం & సహకార శాఖ: చిత్తూరు జిల్లా G.D. నెల్లూరు మండలం చిన్నవేపంజరి రెవెన్యూ గ్రామంలో మహాదేవమంగళం సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్‌లో …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా “నవచేతన” బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభం

-ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం -తొలి 1,000 రోజులు చిన్నారి భవిష్యత్తును నిర్ణయించే స్వర్ణావకాశం : మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్యారంభ అభివృద్ధి (Early Childhood Development – ECD) మరియు అభివృద్ధి స్క్రీనింగ్‌పై రాష్ట్రవ్యాప్త సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

మైనారిటీల విద్యాభివృద్ధి కోసం కృషి

-చంద్రబాబు హయాం లోనే మైనారిటీల సంక్షేమం -మైనారిటీ,న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ఎస్ ఎస్ సి, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : *మైనారిటీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యలో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులను గురువారం మంత్రి సన్మానించి ఆశీర్వదించారు. వెలగపూడి సచివాలయం మూడవ బ్లాక్ కాన్ఫరెన్స్ …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళులర్పించిన జనసేన నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం …

Read More »

నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్‌

-గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం -సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం -టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్ గ్రిడ్ వైపు.. ఏపీ టూరిజంలో విప్లవాత్మక …

Read More »

APCRDA ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ కూలింగ్” విధానంపై సాంకేతిక అవగాహన సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి, సుస్థిరమైన రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) అమరావతి చాప్టర్, ISHRAE విజయవాడ చాప్టర్‌ల సహకారంతో “అమరావతికి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ” అంశంపై రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో గురువారం సాంకేతిక అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో APCRDA, ADCL, AGICL, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు …

Read More »