Breaking News

Tag Archives: amaravathi

కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది

-కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదు -కోడెల విగ్రహం దొంగచాటుగా పెట్టాల్సిన అవసరం లేదు -ఘనంగా కోడెల విగ్రహాన్ని అందరి సమక్షంలో ఆవిష్కరిస్తాం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కోడెల చేసిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదని …

Read More »

విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా …

Read More »

బీసీ విద్యార్థిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి ఆకస్మిక మృతిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తక్షణమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ లో ఏడో తరగతి చదువుతున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన కొణతాల శ్యామలరావు(12) ఎప్పటిలాగే ఆదివారం …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ సిద్ధం!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ తయారీ న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేష్ న్యూయార్క్ లోని విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ …

Read More »

జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తాం

-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంద్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగు దొడ్లు, గృహ స్థలం, గృహం …

Read More »

సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు

-రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు -డ్రోన్లతో రోడ్లను తనిఖీ చేస్తాం -రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లూ వస్తాయి -ఐదేళ్లలో సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు -వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం -రాష్ట్రంలో 76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు -రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం -వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల పనులు -మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు తీరం పొడవునా పోర్టుల నిర్మాణం -ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత -175 నియోజవర్గాల్లో …

Read More »

రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యం

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం స్థానిక చినఅమిరం కూడలిలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి పనులను జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా పెద్ద …

Read More »

అక్కా చెల్లెమ్మలకు గ్యాసు సిలిండర్లు ఉచిత పంపిణీ

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ముఖ్యమైనది దీపం-2 పథకం.. అక్కా చెల్లెమ్మలకు గ్యాసు సిలిండర్లు ఉచిత పంపిణీ రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నుండి ఉచిత గ్యాసు సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్… శనివారం జిల్లా కలెక్టరేటు మీకోసం సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా 10 లబ్ధిదారులకు ఇన్చార్జి …

Read More »

సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి…

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ …

Read More »

మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో వరదలా ఏపిలోకి పెట్టుబడులు : డూండి రాకేష్

-చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలు -ఓర్వలేక విమర్శలు చేస్తున్న వైసీపీ బురద నేతలు -గడిచి ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టిన నిచులు ఈ వైసీపీ నేతలు -నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశే కూటమి ప్రభుత్వం లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు తీసుకురాలేక దొంగ ఎంఓయూలు చేసుకుని.. ఉన్నపరిశ్రమలను కూడా తరిమికొట్టి గత ఐదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిండా ముంచిన ఈ వైసీపీ దద్దమ్మ ప్రభుత్వం.. ఆ పార్టీ బురదనేతలు నేడు ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో పెట్టుబడులు …

Read More »