Breaking News

అక్కా చెల్లెమ్మలకు గ్యాసు సిలిండర్లు ఉచిత పంపిణీ

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ముఖ్యమైనది దీపం-2 పథకం.. అక్కా చెల్లెమ్మలకు గ్యాసు సిలిండర్లు ఉచిత పంపిణీ రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నుండి ఉచిత గ్యాసు సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్…

శనివారం జిల్లా కలెక్టరేటు మీకోసం సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా 10 లబ్ధిదారులకు ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా శాసన సభ్యులు సంయుక్తంగా ఉచిత గ్యాసు సిలిండర్లును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాసు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబరు 01 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగిందని, ఇది గొప్ప పండుగ వాతావరణంలో జరిగిందని, అక్కా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చెప్పలేనిది అని అన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి దీపం -2 పథకం వర్తిస్తుందని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని, అర్హులైన ప్రతి కుటుంబానికి అందించుటయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దీపం పథకం, డ్వాక్రా సంఘాలు మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామన్నారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసి, ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఏపియస్ సిపిసి చైర్పర్సన్ పీతల సుజాత, శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు, కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పితాని సత్యనారాయణ,ఆరిమిల్లి రాధా కృష్ణ,బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాధ్, జిల్లా రెవిన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, కెఆర్సి డిప్యూటీ కలెక్టరు బి. శివనారాయణ రెడ్డి,ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజరు టి.శివరామ ప్రసాదు, డీయస్ వో యన్.సరోజ, డిఆర్డిఏ పిడి యం.యస్.యస్. వేణుగోపాల్, ఏయస్ వో యం.రవిశంకర్, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *