Breaking News

Tag Archives: amaravathi

సనాతన ధర్మానికి ప్రతీక ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని దానాలుకన్నా… అన్నదానం మిన్న… మన పెద్దలు చెప్పిన సిద్దాంతాన్ని అమలు చేస్తూ కాశీ మహాక్షేత్రంలో నిత్యాన్నదానానికి సనాతన ధర్మానికి ప్రతీక అయిన ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ కొనసాగిస్తుంది. 4వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నట్లు ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ స్థాపకులు ‘శ్రీకంఠ బాబాజీ’ తెలిపారు. ఈ సందర్భంగా కాశీలో ఆయనను కలిసిన మా ‘ప్రతినిధి’తో ఆయన మాట్లాడుతూ…తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పబడిన ‘శ్రీ సత్యనారాయణమ్మ నిత్యాన్నదాన సత్రం’ ద్వారా కాశీవిశ్వేశ్వరుడు, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణా …

Read More »

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

-దేశంలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఆవిష్కరణ -45 లక్షల మందికి క్వాంటం, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ -క్వాంటం మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం -ఔషధాల నుంచి క్రయోజెనిక్స్ వరకూ పరిశోధనలకు కేంద్రంగా క్వాంటం వ్యాలీ -ఎస్ఆర్ఎం, మేధాటవర్స్‌లోని 1 ఎస్,1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని …

Read More »

చంద్రబాబు విజన్ తో మైనారిటీ యువతకు ఉజ్వల భవిష్యత్తు

-రూ. 2.75 కోట్లతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు,లైబ్రరీల ఆధునీకరణ -రాష్ట్రంలో 36 కేంద్రాలకు 216 కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన -మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి -శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్ వేర్ ఏర్పాటు -ఏఐ, సైబర్ నెట్ వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి డిమాండ్ కోర్సులకు శిక్షణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో రూ. 2.75 కోట్లు వ్యయంతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, …

Read More »

రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుంది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం (15-04-26) రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 14, …

Read More »

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ : మంత్రి కందుల దుర్గేష్

-2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం -10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా – భద్రతకు అగ్రతాంబూలం -త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని మంత్రి దుర్గేష్ వెల్లడి -నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వివరాలు వెల్లడించిన మంత్రి దుర్గేష్ అమరావతి/ మంగళగిరి, …

Read More »

కెమెరా కళ్లు …దొంగల ఆటలకిక చెల్లు!

-రియ‌ల్ టైమ్‌లో నిందితులను ప‌ట్టిస్తున్న సీసీకెమెరాలు -తిరువూరులో చోరీ చేసిన దొంగ‌ను ప‌ట్టించిన కెమెరాలు -ఒంగోలులో హిట్ అండ్ ర‌న్ కేసులో నిందితుడి ఆట కట్టించిన స‌ర్వైలెన్స్‌ -కేసుల ద‌ర్యాప్తులో కీల‌కంగా మారుతున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ360 -ఏఎన్‌పీఆర్ అన‌లిటిక్స్ ద్వారా పోలీసుల‌కు రియ‌ల్ టైమ్ అల‌ర్టులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ తిరువూరులో ఓ చోరీ కేసు న‌మోదైంది. ఇంటి తాళాలు ప‌గ‌ల‌గొట్టి ఇంట్లోని సొత్తు, ఇంటి య‌జ‌మాని బుల్లెట్ బైకుతో దొంగ ఉడాయించాడు. ఈ కేసు …

Read More »

ఉగ్రవాదానికంటే ప్రమాదకరంగా వైఎస్సార్సీపీ ఉన్మాదం

-ఆస్తి, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్నే విస్మరించారు -ఎంపీలు ‘ఆత్మహుతి దళం’ అని మాట్లాడుతుంటే అది పార్టీయా, ఉగ్రవాద సంస్థా? -చంపేస్తాం, నరికేస్తాం అని బెదిరించే వైకాపా ఒక ‘గొడ్డలి పార్టీ’ -సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వీడియోలు -నాసిరకం మద్యంతో వేల మంది ప్రాణాలు తీసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన అరాచక పార్టీ వైకాపా -రాష్ట్రం నుంచి ఉన్మాద శక్తులను తరిమికొట్టాలి -మంత్రి కొలుసు పార్థ సారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

-మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించిన పరిశోధన బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఉద్దాన ప్రాంత వాసుల నుంచి వ్యాధుల రాకకు కారణాలపై రక్త నమూనాలను సేకరిస్తున్నారు. కిడ్నీ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించేలా మూత్ర నమూనాల పరీక్షలో ‘బయో మార్కర్స’ విధానాన్ని …

Read More »

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

-రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్ల పరిధిలో సూక్ష్మ సేద్యం -రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినందుకు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత …

Read More »

ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Read More »