Breaking News

సనాతన ధర్మానికి ప్రతీక ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని దానాలుకన్నా… అన్నదానం మిన్న… మన పెద్దలు చెప్పిన సిద్దాంతాన్ని అమలు చేస్తూ కాశీ మహాక్షేత్రంలో నిత్యాన్నదానానికి సనాతన ధర్మానికి ప్రతీక అయిన ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ కొనసాగిస్తుంది. 4వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నట్లు ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ స్థాపకులు ‘శ్రీకంఠ బాబాజీ’ తెలిపారు. ఈ సందర్భంగా కాశీలో ఆయనను కలిసిన మా ‘ప్రతినిధి’తో ఆయన మాట్లాడుతూ…తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పబడిన ‘శ్రీ సత్యనారాయణమ్మ నిత్యాన్నదాన సత్రం’ ద్వారా కాశీవిశ్వేశ్వరుడు, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారి అనుగ్రహ కటాక్షంతో ఈ నిత్యాన్నదాన కార్యక్రమం నిత్యం వచ్చే వందలాది మంది భక్తులకు అందజేయగలుగుతున్నామన్నారు. ఇప్పటికే వందలాది మంది జాతి, వర్గ, వర్ణ విభేదాలకు తావులేకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఖర్చుతో కూడుకున్న కాశీని ఇక జీవితంలో చూడలేమేమో అనుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రైలు ఖర్చులు, నామినల్‌గా అతి తక్కువ ఖర్చుతో వసతి కల్పించి వారికి 9 రోజులు అక్కడ వుండే విధంగా సౌకర్యం అవకాశం కల్పించి వారికి కోరిక తీర్చామని ఇప్పటికి ఎంతో మంది ఇప్పటికి వస్తూనే వున్నారని ఈ విధంగా ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ ద్వారా అందరికి కాశీ దర్శనం కల్పించే అవకాశం కల్పించిన ఆదేవదేవునికి మరింత మందికి సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తున్నానన్నారు. కాశీ వచ్చి ఎక్కడ బసచేసినా కూడా తమ ఆశ్రమంకి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చునన్నారు.
భవిష్యత్‌లో కాశీ మహాక్షేత్రంలో భక్తుల వసతి, భోజనసౌకర్యార్థం నూతనంగా శ్రీకంఠ ఋష్యాశ్రమం నిర్మించనున్నామన్నారు. దాని కోసం ‘కాశీలో భూదాన మహాయజ్ఞం’కు శ్రీకారం చుట్టామన్నారు. దానిలో భాగంగా ‘భూమి కోసం భిక్షాటన’ కార్యక్రమం ద్వారా శ్రీకంఠ ఋష్యాశ్రమం నిర్మాణానికి భూసేకరణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ భూధాన మహాయజ్ఞంలో పాల్గొని ఆశ్రమ నిర్మాణంలో భాగస్వాములు అయిన వారి పేరు, వారి పెద్దలు పేరు శ్రీకంఠ ఋష్యాశ్రమంలో శిలాఫలకంపై శాశ్వతంగా లిఖించబడుతుందన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు కాశీలో బసచేసినపుడు వసతి సౌకర్యాలు, వారి పేరుమీద అన్నదాన సమారాధన కార్యక్రమం తదితర సౌకర్యాలు కల్పించబడతాయన్నారు. పాండే హవేలి, బెంగాలి టోలా, డో.నెం.27/9ఎ, నాధుషా బ్రహ్మపురి, భోళానంద సన్యాసాశ్రమం ఎదురుగా, నారదాఘాట్, కాశీ (వారణాసి)లోని ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’లో ప్రతిరోజు ఎంతమంది వచ్చినా కూడా నిత్యాన్నదానం జరుగుతుందన్నారు. భక్తులు కాశీ వచ్చినపుడు తమ ఆశ్రమంలో వుండదలచిన వారు 6305665382, 9491574080, 9866377208 సంప్రదించవచ్చనని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *