అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Prajavartha Online Telugu News