Breaking News

అమరావతి ఆంధ్రుల శాశ్వత రాజధాని

-కూటమి ప్రభుత్వపాలన రాష్ట్రానికి వరం
-రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వంచించారు
-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా నిలిచిన రాజధాని అమరావతి విషయంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019 సాధారణ ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. రైతులు తమ భూములను త్యాగం చేసి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని నిర్మించేందుకు ముందుకు వచ్చిన సందర్భంలో ఆ హామీ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు.
అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అదే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు రావడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు .ఇది ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన ఘటన అని. అమరావతి విషయంలో తీసుకున్న అనిశ్చిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా విమర్శలకు గురైందని కొండారెడ్డి పేర్కొన్నారు. రాజధాని స్పష్టత లేకుండా రాష్ట్ర పరిపాలన సాగడం వల్ల అభివృద్ధి దెబ్బతిన్నదని, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారని, యువత భవిష్యత్తు సందిగ్ధంలో పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులు, మహిళలు, యువత చేసిన నిరసనలు, దీక్షలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు. 2024 ఎన్నికలు ప్రజా తీర్పు ద్వారా స్పష్టమైన సందేశం. తీర్పు యాదృచ్ఛికం కాదని అమరావతి అంశంపై స్పష్టమైన స్పందన అని కొండారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు.ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , యువ నేత నారా లోకేష్ ల పై విశ్వాసం ఉంచారని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు.కూటమి ప్రభుత్వ ముందడుగు అమరావతి పై చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేస్తోందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *