Breaking News

Tag Archives: delhi

ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురండి ..

-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చ‌ర్చించిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. ఢిల్లీలో ఎంపీ బ‌స్తిపాటి నాగ‌రాజుతో క‌లిసి కేంద్ర మంత్రిని.. మంత్రి టీజీ భ‌ర‌త్ క‌లిశారు. ఇటీవ‌ల బ‌స్సు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన‌ విష‌యాన్ని గుర్తు చేశారు. క‌ర్నూలు …

Read More »

ప్రాజెక్టుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన మంత్రి టీజీ భ‌ర‌త్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క అధునాతన రక్షణ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. మంత్రి టీజీ భ‌ర‌త్ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన రక్షణ తయారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి అధికారికంగా ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా డిఫెన్స్ …

Read More »

పథకాన్ని పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి… : ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 …

Read More »

ఎంఎస్ఎంఈ ఏకోసిస్టంను బలోపేతం చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-ఢిల్లీ పర్యటనలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ డా. రజనీష్ తో సమావేశం అయిన మంత్రి కొండపల్లి -రాష్ట్రంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించిన మంత్రి. న్యూఢిల్లీ. నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో మంగళవారం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి మరియు అభివృద్ధి కమిషనర్ డా. రజనీష్ ను కోరారు. రెండు …

Read More »

​భారత తయారీ రంగానికి ఊతం

-పరిశ్రమ-ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయాలని ఏపీ ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు ​న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తయారీ రంగ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (CII) ద్వారా కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) సహకారంతో నిర్వహించిన 22వ సీఐఐ గ్లోబల్ ఎంఎస్ఎంఈ బిజినెస్ …

Read More »

ఎఫ్‌ఐఈఓ “గ్లోబల్ టెండర్ సర్వీసెస్ (జీటీఎస్)”ను ప్రారంభం

-భారతీయ ఎగుమతిదారుల అంతర్జాతీయ టెండర్ అవకాశాల ప్రాప్యతను పెంపొందించేందుకు ఎఫ్‌ఐఈఓ “గ్లోబల్ టెండర్ సర్వీసెస్ (జీటీఎస్)”ను ప్రారంభించింది న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ధనతేరస్ పర్వదినాన్ని పురస్కరించుకొని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) తమ తాజా ప్రథమ శ్రేణి కార్యక్రమం — గ్లోబల్ టెండర్ సర్వీసెస్ (GTS) — ను గర్వంగా ప్రారంభించింది. భారతీయ ఎగుమతిదారుల, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల (MSMEs) అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఇది ఒక పరివర్తనాత్మక అడుగు. ఎఫ్‌ఐఈఓ అభివృద్ధి …

Read More »

విశాఖకు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

-దేశంలో తొలి ఏఐ డేటా హబ్ ప్రకటించిన గూగుల్ -అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం -సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రకటించిన గూగుల్ -దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావటం గర్వకారణమన్న సీఎం చంద్రబాబు -భారత డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కు ఇది సరికొత్త అధ్యాయమన్న ముఖ్యమంత్రి -డేటా సెంటర్ ఏర్పాటు పై ఎక్స్ వేదికగా ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. -విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన …

Read More »

పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యం

-2027లో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం -పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి -ఢిల్లీలో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి రామానాయుడు వివరాలు వెల్లడి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పడకేసిన ‘పోలవరం’ పనుల ను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర జల …

Read More »

ఎయిర్ బస్ బోర్డుతో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలోని ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తో కలిసి ఎయిర్‌బస్ బోర్డుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎయిర్‌బస్ మొత్తం బోర్డు భారతదేశానికి వచ్చిన ఇదే మొదటి సందర్భం కావడంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారత్‌–ఎయిర్‌బస్ మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ కంపోనెంట్ తయారీ, ఎమ్‌.ఆర్‌.ఓ (మెంటినెన్స్, …

Read More »

ఏపీకి పూర్వోదయ పథకం కింద నిధులివ్వండి

-వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఆ నిధులే కీలకం -ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రికి సీఎం చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం ఆమెకు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై …

Read More »