Breaking News

Tag Archives: machilipatnam

ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు సింగపూర్ బృందం సభ్యులకు వివరించారు. బుధవారం సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చిన సింగపూర్ బృందం కలెక్టరేట్లో సమావేశం అనంతరం బందరు ఓడరేవును సందర్శించారు. ఆక్కడ జరుగుతున్న ఓడరేవు నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి దశ …

Read More »

జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యవసాయం, ఆక్వా కల్చర్, పరిశ్రమలు, ఓడరేవు ప్రధానంగా జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డీ జే బాలాజీ సింగపూర్ బృందానికి వివరించారు. బుధవారం ఉదయం సింగపూర్ వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో సింగపూర్ బృందం సభ్యులు డిప్యూటీ సీఈవో తే లియాన్ చెన్ , చువా టైక్ హిం, నిషా షర్డా జిల్లాను అమరావతి ఆర్థిక కారిడార్ లో చేర్చి ఆర్థికంగా …

Read More »

ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ నివారణ…. : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ ను అరికట్టగలమని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మచిలీపట్నం జిజిహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కోనేరు సెంటర్ నుండి బెల్ కంపెనీ వరకు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్యులు తదితరులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఖైనీ గుట్కా నమలొద్దు.. క్యాన్సర్ బారిన పడొద్దు, …

Read More »

కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హాజరై వేడుకలకు విశిష్టతను చేకూర్చారు. కార్యక్రమ ప్రారంభంలో నెట్టెం రఘురామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, హాజరైన అధికారులు, సిబ్బంది సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ వందనం నిర్వహించబడింది. జాతీయ జెండా …

Read More »

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …

Read More »

కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అవార్డు అందుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. 2002 ఓటర్ల జాబితా ను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమం లో అత్యధికంగా …

Read More »

ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’

– మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు – భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు – మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపుల ఏర్పాటు – మెడికల్ క్యాంపులో 350 యూనిట్ల రక్తం దానం, 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా …

Read More »

బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించేందుకు అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మత పెద్దలను కోరారు. మంగళవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు, మత పెద్దలతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా పేద జిల్లా …

Read More »

వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో సంయుక్త సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా తొలకరి వర్షాలు రాక మునుపే విత్తనపు బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లే కార్యక్రమాన్ని( పీఎండిఎస్ )జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను వినియోగించుకొని వ్యవసాయం చేస్తే సుస్థిరంగా ఉంటుందని, …

Read More »