Breaking News

Tag Archives: machilipatnam

పర్యాటక ప్రదేశాలు తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు.  జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి …

Read More »

ప్రభుత్వ శాఖల జిల్లా ప్రగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతిపై సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిని ప్రభుత్వానికి వివరించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఎక్సైజ్, మైన్స్, అటవీ, …

Read More »

మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పని ప్రదేశాలలో మహిళలకు తగిన భద్రత వాతావరణం కల్పించి, వారిని గౌరవించడం కోసం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ చట్టంపై తగిన ప్రచారం అవగాహన కల్పించడం కోసం కలెక్టరేట్ లో ఈచట్టంలోని అంశాలపై ఏర్పాటుచేసిన డిస్ప్లే బోర్డ్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్ట ప్రకారం కార్యాలయాలు, కర్మాగారాలు, స్వయం …

Read More »

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా భావించి సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, బందరు ఆర్డిఓ కే.స్వాతిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను …

Read More »

ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …

Read More »

వీర జవానుల కుటుంబాలను ఆదుకోవడం అందరి బాధ్యత — జిల్లా కలెక్టర్

పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యతని, సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని శనివారం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ …

Read More »

రైతు సేవ కేంద్రంలో నమోదైన తేమశాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్

ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సేవ కేంద్రాల్లో నమోదు చేసిన తేమ శాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు, మధ్య దళారులను నివారించి, ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధరలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు తెలిపారు. కలెక్టర్ ఆదివారం ఘంటసాల మండలం మాజేరు, లంకపల్లి, పూషడం, దేవరకోట తదితర గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులతో కూడా మాట్లాడి తేమ శాతం …

Read More »

జీవితంలో ఎదగడానికి పట్టుదల, కృషి అవసరం… : జిల్లా కలెక్టర్

పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పట్టుదల, కృషి కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. శనివారం ఉదయం పెనమలూరు మండలం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ సృజనాత్మకంగా తయారుచేసిన గ్రీటింగ్స్ ను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని ఆయన విద్యార్థులను …

Read More »

బాధితులకు భరోసాగా కొల్లు రవీంద్ర

– నియోజకవర్గంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత – ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న వారికి అనుక్షణం అండగా ఉంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సై్జ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అందించారు. పేదలకు, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాల …

Read More »

“జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.12.2024 మంగళవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. …

Read More »