మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పుటకు అడ్డుగా ఉన్న సమస్యలన్నిటిని వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల పురోగతి, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. గత డిసెంబర్ 30 వ తేదీన పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో అందిన అన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »Tag Archives: machilipatnam
మారిషస్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే కి ఘనంగా వీడ్కోలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారిషస్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే కి గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈనెల 3వ తేదీన రాష్ట్రానికి అతిధిగా వచ్చిన మారిషస్ దేశాధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో 3 రోజుల పర్యటన ముగించుకొని గుంటూరు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాన్వాయిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, …
Read More »ఒంటరి వృద్ధునికి నీడనిచ్చిన పీ-4 ప్రోగ్రామ్
-ఇల్లు కట్టి ఇచ్చిన సర్పంచ్ కుమారుడు -రూ.లక్షా 25వేలు వ్యయంతో రేకుల పైకప్పుతో నూతన పక్కా గృహం నిర్మించి ఇచ్చారు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ-4 ప్రోగ్రామ్ పేదల జీవితాల్లో మార్పు తెస్తోంది. దాతల ఔదార్యాన్ని పేదల చెంతకు చేర్చే నిజమైన వారధిలా నిలుస్తోంది. ఘంటసాల మండలం వేములపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన బెజవాడ వీరరాఘవులుకు భార్యాపిల్లలు లేరు. ఆయన కొన్నేళ్ళ నుంచి పూరిపాకలో జీవిస్తున్నాడు. వీరరాఘవులు అవసరాన్ని …
Read More »ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »యోగాతో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం
-మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. యోగా గురువు ములక్ రాజ్ మహా రాజ్ వారి 127వ జయంతి పురస్కరించుకొని ఏపీ యోగా సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని గాంధీనగర్ లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనం నుండి యోగా సభ్యులచే బైక్ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ …
Read More »మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే కి ఘన స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే కి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ నెల 3 వ తేదీ నుంచి 8 తేదీ వరకు 6 రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా చేరుకున్న మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం …
Read More »క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు చదువే ప్రధానమని, క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్భోదించారు. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో కృష్ణ సంకల్పం పేరుతో వినూత్నంగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు చిన్న సైజు బల్లలు, బాలికలకు సానిటరీ నాప్కిన్ కిట్లు, ముస్తాబు కిట్లు, ఉద్యోగులకు వివిధ రకాల ప్రయోజనాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పంపిణీ చేశారు. రెవెన్యూ, ఎస్సీ …
Read More »2026లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి..
-జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, 2026లో ఆయన నాయకత్వంలో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులకు ఉపయోగపడే చిన్న సైజు బల్లలను పెద్ద …
Read More »రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రమాదాలు నివారించుటకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు రహదారి …
Read More »గ్రామాల యూనిట్ గా అభివృద్ధి..
-హుస్సేన్ పాలెం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన.. మచిలీపట్నం (హుస్సేన్ పాలెం), నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అరిసేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హుస్సేన్ పాలెం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర వైద్య భవన నిర్మాణానికి బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ …
Read More »
Prajavartha Online Telugu News