Breaking News

Tag Archives: machilipatnam

రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం/ఉయ్యూరు/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలోని పలు మిల్లులు, రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ బందరు మండలంలోని సుల్తాన్ నగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదేవిధంగా ఎస్ ఎన్ గొల్లపాలెంలో రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యంలోని తేమ …

Read More »

ముడా ప్రణాళికతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం…  : ముడా చైర్మన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మచిలీపట్నం అభివృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గల మచిలీపట్నం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (ముడా) కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం అర్బ న్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా …

Read More »

కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు, సీళ్ళు పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టరులో సంతకం చేసారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసి నివేదిక పంపవలసి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ …

Read More »

కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ సూపర్నెంట్ అనంతలక్ష్మి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పటిష్టవంతంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పటిష్టవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఇరిగేషన్ ఏఈ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 204 సాగునీటి సంఘాలు, 27 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 2318 టెరిటోరియల్ కాన్స్టిట్యూఎన్సీస్, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయని, వీటికి ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు ఓటర్ల జాబితా ఫైనలైజ్ చేసి ఒకటి …

Read More »

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మట్టా ప్రసాద్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) చైర్మన్ గా మట్టా ప్రసాద్ గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో ముడా చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర …

Read More »

పంటను ప్రభుత్వానికి అమ్మి మద్దతు ధరను పొందండి..

-రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చు.. -దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని రైతులకు మంత్రి సూచన -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. గురువారం మంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలసి కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాలలో పర్యటించి రైతులతో …

Read More »

ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి…

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈనెల 25న కోత కోశామని, గూడూరు మండలంలో దగ్గర్లో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని …

Read More »

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో కలసి ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి …

Read More »

మచిలీపట్నం నగర సుందరీకరణకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో తడి పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో నగరంలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్ లోనే తడి పొడి చెత్త …

Read More »