Breaking News

Tag Archives: machilipatnam

పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10 వ (ఎస్ ఎస్ సి) తరగతిలో ఆనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా …

Read More »

ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలనా ప్రత్యేక అధికారి డీకే బాలాజీ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తన సిబ్బందితో సహా ఎలక్ట్రిక్ సైకిల్ పై స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నగరంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి గ్రీన్ స్పాట్లను, చెత్తాచెదారాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా 37, 38, 39 డివిజన్లలో పరాసుపేట, గాదె వారి …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ ఏడాదికి సుమారు రూ.42 వేల సంక్షేమాభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం

-యువతకు ఉద్యోగ–ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం -రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పామర్రు/మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే కారకంపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, అవ్వాతాతలను పలకరిస్తూ, వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, గ్రామ సమస్యలను స్వయంగా …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ముఖ్యమంత్రి ప్రజావేదిక వద్ద శ్రామికుల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా నమూనాను సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన వివిధ రకాల పనిముట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి యమ్ వి శేషగిరి బాబు లేబర్ అడ్డాలో ఏర్పాటుచేసిన …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బీ విద్యాసాగర్ నాయుడు శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్ తో కలసి పమిడిముక్కల మండలంలో ముందస్తు భద్రత సమన్వయ ( ఏ ఎస్ ఎల్) ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం వారు పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలని, బుధవారం రాత్రి కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే మే నెల 1వ తేదీన పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తొలుత కలెక్టర్ మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో …

Read More »

33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత అధునాతనమైన పరిజ్ఞానంతో లోవోల్టేజ్ సమస్య అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని 14 వ డివిజన్ బచ్చుపేట ప్రాంతంలో 6.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి …

Read More »

పేదలందరికీ పక్కా ఇళ్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం

– గత ఐదేళ్లు ఇళ్ల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు – నివాస యోగ్యం కాని భూముల్లో స్థలాలిచ్చి జేబులు నింపుకున్నారు – కూటమి ప్రభుత్వంలో తాగునీరు, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం – కరగ్రహారంలో ఇంటిస్థలాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేద వాడికి సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కరగ్రహారంలో గత …

Read More »

బీచ్ పర్యాటకానికి మంగినపూడిని కేరాఫ్ అడ్రస్‌గా అభివృద్ధి చేస్తాం

– మచిలీపట్నం చరిత్రలో మసులా బీచ్ ఫెస్ట్ మరచిపోలేనిది – రిసార్ట్స్, వాటర్ స్ప్రోట్స్, సినీ షూటింగులకు సన్నాహాలు చేస్తున్నాం – పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు – సీఎస్ఆర్ ఫండ్స్‌తో బీచ్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగినపూడి …

Read More »

విద్యుత్ సంస్కరణలతో ఏపీని అభివృద్ధి కేంద్రంగా మారుస్తాం

– సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ వినియోగం పెరగాలి – కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ విజయవంతం చేద్దాం – గత ఐదేళ్లు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు – మచిలీపట్నంలో పీఎం సూర్య ఘర్ పథకం సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ …

Read More »