Breaking News

విద్యుత్ సంస్కరణలతో ఏపీని అభివృద్ధి కేంద్రంగా మారుస్తాం

– సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ వినియోగం పెరగాలి
– కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ విజయవంతం చేద్దాం
– గత ఐదేళ్లు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు
– మచిలీపట్నంలో పీఎం సూర్య ఘర్ పథకం సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం 23వ డివిజన్లో వుల్లంగి పాలెం లోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్, డొమెస్టిక్ యూనిట్ల ప్రారంబోత్సవంలో మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మంత్రివర్యులు అక్కడి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన వారిని అభినందించారు. మచిలీపట్నం ఉల్లింగిపాలెం ఎస్సీ ఎస్టీ కాలనీలో 2 కిలోవాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసుకున్న యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పటు చేసిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మార్పులకు అనుగునంగా అడుగులు వేసినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడ్డామన్నారు..

.
గతంలో జల విద్యుత్, విండ్ పవర్ వ్యవస్థలను అందిపుచ్చుకున్నామణి, . ఇప్పుడు సోలార్ యుగం మొదలైందన్నారు. .దేశంలో సంప్రదాయ విద్యుత్ వినియోగానికి బదులుగా ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థపై ఆధారపడడంతో పాటుగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చామన్నారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ప్రకటించి. రూ.1.20 లక్షలకే 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. అందులోనూ బడుగు బలహీన వర్గాలకు మరింతగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు.

.ఇంటిపై ఏర్పాటు చేసుకున్న ప్యానెల్స్ కు అద్దె కూడా చెల్లిస్తున్నారన్నారు. . 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ కు సబ్సిడీ అందిస్తున్నారూ. ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఉచితం అన్నారు.. గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా అదనపు విద్యుత్తుకు ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది.

2014-19లో రాష్ట్ర విభజన సమయానికి 24 మిలియన్ యూనిట్ల లోటులో ఉంటే 2019 నాటికి ఏపీని మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చామన్నారూ.. . గత ప్రభుత్వంలో వ్యవస్థ మొత్తాన్ని అస్తవ్యస్థంగా తయారు చేశారన్నారు. . పీపీఏలు రద్దు చేసి, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు నాయుడుగారు పీపీఏల ద్వారా రూ.4కే యూనిట్ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటే.. గత ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపిందన్నారు.

కూటమి అధికారంలోకి రాగానే సోలార్, విండ్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పంప్డ్ పవర్పై కూడా దృష్టి పెట్టామని, రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయన్నారు. అనకాపల్లిలో 6 గిగావాట్ల సోలార్ వాట్ల పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశామన్నారు. . దేశంలో ఇప్పటి వరకు 1 గిగవాట్ మాత్రమే ఉంటే.. గూగుల్ మూడు గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. . మరో మూడు గిగావాట్ల డేటా సెంటర్లు కూడా రాబోతున్నాయన్నారు. . రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడనీ. వారి పాలనా దక్షత కారణంగా దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వచ్చాయన్నారు. . ఏపీలో అపారమైన అవకాశాలున్నాయనీ. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని. సంక్షేమ పథకాలకు తోడుగా.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారూ.. . పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు.. గుంతలు లేని రోడ్లు సాకారం చేసి చూపించామన్నారు.. ప్రతి పేద వాడికి సొంతిళ్లు సాకారం చేసి చూపించామన్నారు.

పేదలకు ప్రయోజనం చేకూర్చే సూర్య ఘర్ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. . ఇప్పటికే మచిలీపట్నంలో 975 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని. నియోజకవర్గం మొత్తాన్ని సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.. నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు లక్ష్యం నిర్దేశించారనీ. దాన్ని సాధించేందుకు అవసరమైన మేరకు తోడ్పాటు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిడిసిఎల్ ఎస్ఈ రవీంద్రబాబు, ఈఈ గోవిందరావు, డి ఈ రామకృష్ణ, ఏ ఈ రమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *