Breaking News

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ముఖ్యమంత్రి ప్రజావేదిక వద్ద శ్రామికుల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా నమూనాను సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన వివిధ రకాల పనిముట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి యమ్ వి శేషగిరి బాబు లేబర్ అడ్డాలో ఏర్పాటుచేసిన సౌకర్యాల గురించి ముఖ్యమంత్రికే వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పి..4 పథకం కింద మార్గదర్శి లింగమనేని వెంకటేష్ అందించిన 5 లక్షల రూపాయల మెగా చెక్కును 35 మంది భవన నిర్మాణ కార్మికులైన బంగారు కుటుంబాల లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిభ కనబరిచిన శ్రామికులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలానికి చెందిన అసెంబ్లీ సెక్షన్ వర్కర్ పిల్లా జ్యోతి, ఎన్టీఆర్ జిల్లా రాంకో సిమెంట్స్ చెందిన ఎస్ పోతురాజు, బాపట్ల జిల్లా ఐటీసీకి చెందిన కె రామకృష్ణ, కర్నూలు జిల్లా రాయలసీమ హైపో ప్లాంట్ కు చెందిన ఎం రవికుమార్ లను శ్రమశక్తి బహుమతి కింద శాలువ, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే ఉత్తమ యాజమాన్యాల కింద సాంబశివరావు, సుమంతు, చైతన్యలను కూడా గుర్తించి వారిని కూడా ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *